ఆన్‌లైన్‌ ఫార్మసీలకు అనుబంధంగా ఉన్న 23 మెడికల్‌ షాపుల లైసెన్సులు సస్పెండ్‌

22 hours ago

తెలంగాణలో ప్రత్యేక తనిఖీల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 23 మెడికల్‌ షాపుల లైసెన్సులను TG SAFE సస్పెండ్‌ చేసింది. మరో తొమ్మిది దుకాణాలకు హెచ్చరికలు జారీ చేసింది. Tata 1mg, Netmeds, Zepto, Apollo 24/7, MedPlus MART, Instamart వంటి ఆన్‌లైన్‌ మందుల పంపిణీ సంస్థలకు అనుబంధంగా ఉన్న లైసెన్స్‌ పొందిన దుకాణాలను తనిఖీ చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల విక్రయం, రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టుల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.

మెడికల్‌ షాపుల తనిఖీలు, ఔషధాల ర్యాక్‌లు, TG SAFE అధికారుల తనిఖీ బృందం.