Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా

1 hour ago

Easy Egg Maggi Recipe : సాయంత్రం ఏమైనా స్నాక్స్ తినాలని లేదా నైట్ క్రేవింగ్స్ ఉంచే.. మీరు ఎగ్​ మ్యాగీ ట్రై చేయవచ్చు. టేస్టీగా, చైనీస్ స్టైల్​లో మ్యాగీ కావాలనుకుంటే ఏ రెసిపీ ఫాలో అవ్వాలో చూసేద్దాం.

Tasty Egg Maggi Recipe : మ్యాగీ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమే. అయితే ఎప్పుడూ ఒకేలా మ్యాగీ చేసుకోవడం కంటే.. గుడ్డు, కొన్ని కూరగాయలు, కొద్దిగా మసాలా వేసి.. ఎగ్ మ్యాగీ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పెద్దగా ఏమి లేకపోయినా ఈజీగా, టేస్టీగా మ్యాగీ తినాలనుకుంటే కచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మరి దీనిని ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

మ్యాగీ - 1 ప్యాకెట్

గుడ్లు - 2

ఉల్లిపాయ - 1 చిన్నది

టమాటా - 1 చిన్నది

పచ్చిమిర్చి - 1

క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్

మ్యాగీ టేస్ట్‌మేకర్ - 1 ప్యాకెట్

కారం - పావు టీస్పూన్

మిరియాల పొడి - చిటికెడు

నూనె - 1 టేబుల్ స్పూన్

కొత్తిమీర - కొద్దిగా

ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలంటే..

ముందుగా పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మెత్తగా మారే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు టమాటా, క్యారెట్ వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. కూరగాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత వాటిని పాన్‌లో ఒకవైపుకు జరిపి.. మరోవైపు రెండు గుడ్లు పగలగొట్టి వేయాలి. తర్వాత కొద్దిగా కారం, మిరియాల పొడి వేసి గుడ్లను స్క్రాంబుల్ చేసుకోవాలి.

గుడ్లు ఉడికిన తర్వాత కూరగాయలు, గుడ్లను బాగా కలపాలి. ఇప్పుడు సుమారు ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మ్యాగీ నూడుల్స్, టేస్ట్‌మేకర్ వేసి కలపాలి. నూడుల్స్ మెత్తగా ఉడికే వరకు రెండు మూడు నిమిషాలు ఉంచాలి. మీరు చైనీస్ ఫ్లేవర్ కావాలనుకుంటే.. చివర్లో కొద్దిగా సోయాసాస్ వేసి కలిపితే మ్యాగీకి మంచి స్పైసీ, చైనీస్‌-స్టైల్ రుచి వస్తుంది. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ.

టేస్టీగా రావాలంటే..

గుడ్లను నేరుగా మ్యాగీలో కలపడం కంటే.. ముందుగా కొద్దిగా స్క్రాంబుల్ చేసి తర్వాత నూడుల్స్‌లో కలిపితే గుడ్డు ముక్కలు బాగా కనిపిస్తూ రుచిగా ఉంటాయి. మరింత స్పైసీగా కావాలనుకుంటే చిటికెడు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. దీనిని సాయంత్రం స్నాక్​గా తీసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దలవరకు దీనిని రుచిని ఆస్వాదించవచ్చు. మ్యాగీ రోజూ తినడం పెద్ద మంచిది కాకపోయినా.. బయట మ్యాగీ తినడం కంటే ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం బెటర్. పైగా మంచి రుచి కూడా మీకు సొంతమవుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి.

Click here to Read More
Previous Article
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమే... ట్రైలర్‌లో ఫస్ట్ సీన్ చూస్తే క్లారిటీ వస్తుందిగా

Related లైఫ్‌స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment