భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు

1 hour ago

iPhone 18 Pro Sales in India | భారత్‌లో యాపిల్ ఐఫోన్ 18 ప్రో, iphone Pro Max సేల్స్ ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడానికి అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్లకు చేరుకుంటున్నారు.

iPhone 18 కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ టైం రానే వచ్చింది. భారత్‌లో నేటి నుంచి Apple కొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. దాంతో ఐఫోన్ లవర్స్ దేశంలో పలు నగరాల్లో అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్స్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు.  iPhone 18 Pro ప్రారంభ ధర 1,64,900 రూపాయలుగా ఉంది. కొత్త iPhone కొనుగోలు చేస్తూ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్, No Cost EMI వంటి ఆప్షన్లతో కొంత మొత్తం ఆదా చేసుకోవచ్చు. మీరు కొత్త iPhone కొనాలని ప్లాన్ చేస్తుంటే, కొనడానికి ముందు ధరలు, ఆఫర్ల గురించి తెలుసుకోవాలి. మరి iPhone 18 Pro అత్యంత చౌక డీల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందాం. 

ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, నోయిడా సహా పలు ముఖ్య నగరాల్లో యాపిల్ సెంటర్ల వద్దకు ఐఫోన్ లవర్స్ తరలి వస్తున్నారు. కొత్త ఐఫోన్ మోడల్ సొంతం చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాము ప్రతి కొత్త ఐఫోన్ మోడల్ కొనుగోలు చేస్తామని.. ప్రస్తుతం తమ వద్ద ఐఫోన్ 17 మోడల్ ఉందని కస్టమర్లు చెబుతున్నారు. కొందరు అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్దకు చేరుకోగా, కొందరు ఉదయం 4 గంటల నుంచే స్టోర్ల వద్దకు వస్తున్నారు. 

Click here to Read More
Previous Article
Prithvi Shaw Engagement Broken: నిశ్చితార్థం జరిగిన ఆరు నెలలకే పృథ్వీ షా బ్రేకప్.. ఫియాన్సీ ఆకృతి తో విడిపోతున్నట్లు వెల్లడి

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment