Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్

1 hour ago

రిటైర్డ్ టీచర్ సమస్యపై ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మారువేషంలో బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి మెరుపు తనిఖీ చేశారు.

Polavaram MLA Chirri Balaraju | పోలవరం: ఏలూరు జిల్లాలో పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినూత్న రీతిలో రంగంలోకి దిగారు. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయానికి ఒక సామాన్య పౌరుడిలా మారువేషంలో వెళ్లి అధికారులతో పాటు ప్రజలును ఆశ్చర్యపరిచారు. స్థానిక రిటైర్డ్ టీచర్ ఒకరు తన భూమికి సంబంధించిన పని కోసం ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోకపోలేదు. దాంతో విసుగు చెందిన ఆయన చివరికి కూటమి ఎమ్మెల్యేను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు.

అధికారుల తీరుపై నిశిత పరిశీలన

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న జనసేన ఎమ్మెల్యే బాలరాజు నేరుగా ఆయనే క్షేత్రస్థాయిలో సామాన్యుడిలా రంగంలోకి దిగారు. బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీసులో సుమారు గంటపాటు ప్రజల మధ్య ఉండి, అధికారుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా, సిబ్బందికి టైంకు అందుబాటులో ఉంటున్నారా అని స్వయంగా పరిశీలించారు. పంచె, టీషర్టు ధరించి.. తలపై క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి ఎమ్మార్వో  అక్కడికి వచ్చిన ప్రజలను సైతం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు.

విషయం తెలిసి అధికారులు షాక్

 

తాను ఎవరో చెప్పి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులకు షాకిచ్చారు. అనంతరం తన రాకను వెల్లడించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిరంతరం ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. బాధితుడైన రిటైర్డ్ టీచర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని  అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీసుకున్న ఆకస్మిక తనిఖీ, అది కూడా మారువేషంలో రావడంతో  స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment