మియాపూర్‌ భూములపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధం

2 weeks ago

తెలంగాణలో మియాపూర్‌కు చెందిన సుమారు 550 ఎకరాల భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. సర్వే ప్రకారం దాదాపు 400 ఎకరాలు ఖాళీగా ఉండగా, 150 ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, అభివృద్ధి లేదా వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.