మొబైల్‌ టవర్‌ పరికరాల చోరీ — తొమ్మిది మంది అరెస్ట్‌

21 hours ago

నల్గొండ జిల్లాలో మొబైల్‌ టవర్లలో ఉపయోగించే Radio Remote Units (RRUs) చోరీకి పాల్పడిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ముగ్గురు ఇంజినీర్లు, నలుగురు టెక్నీషియన్లు, ఒక డ్రైవర్‌, ఒక మాజీ ఉద్యోగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 38 చోరీ ఘటనల ద్వారా సుమారు రూ.1.62 కోట్ల నష్టం కలిగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వాహనాలు, నగదు, మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొబైల్‌ టవర్‌ పరికరాలు, పోలీసుల మీడియా సమావేశం, స్వాధీనం చేసుకున్న వస్తువులు.