Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు

    1 month ago

    Chiranjeevi Watch Price: 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వేసుకొచ్చిన బ్లేజర్ రేటు తెలుసా? ఆయన చేతికి ఉన్న వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ అంటుంది.

    సంక్రాంతితో పాటు పెద్ద పండక్కి థియేటర్లలోకి వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ డ్రస్‌లో వచ్చారు. చూసేందుకు సింపుల్‌గా ఉన్నప్పటికీ... ఆయన ధరించిన బ్లేజర్ రేటు తక్కువేం కాదు. ఇక చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ అంటుంది.

    చిరు చేతి వాచ్ రేటు తెలుసా?
    Chiranjeevi rolex watch price: చిరంజీవికి రిస్ట్ వాచ్ (చేతికి పెట్టుకునే వాచ్)లు అంటే ఇష్టం. ఆయన చాలా మంది బహుమతిగా వాచ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' వేడుకకు ఆయన రోలెక్స్ వాచ్ ధరించారు. 
    చిరంజీవి చేతికి ఉన్న వాచ్ Rolex Daytona మోడల్. దాని ధర సుమారు రూ. 1.89 కోట్లు నుంచి రూ. 2.29 కోట్లు వరకు ఉంటుందని తెలిసింది. రెండు కోట్ల రూపాయల వాచ్ ఏమిటి? అనేది అందరూ నోరెళ్లబెడుతున్నారు. 

    చిరు బ్లేజర్ ఆల్మోస్ట్ 2 లక్షలు!
    'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ఫోటోలు గమనిస్తే... ఆయన బ్లేజర్ మీద 'B' లోగో కనబడుతుంది. అంటే... అది Balmain బ్రాండ్‌కు చెందినది అయ్యి ఉండొచ్చు. ఆ కంపెనీ బ్లేజర్ రేటు సుమారు రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు ఉంటాయి. అదీ సంగతి!

    Click here to Read More
    Previous Article
    Donald Trump: భారత్‌పై 500 శాతం సుంకాలు ! ఏర్పాట్లు పూర్తి చేసిన ట్రంప్‌, వచ్చే వారం పార్లమెంటులో బిల్లు!
    Next Article
    KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment