Nara Lokesh all ministries intervention: నారా లోకేష్ సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారా? - బాధ్యతగానా లేకపోతే అధికారం చెలాయిస్తున్నారా?

2 hours ago

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ అన్ని శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అన్నిశాఖలపైనా ఆయన ప్రకటనలు చేస్తున్నారు. సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారా?

Nara Lokesh No 2 in TDP coalition government: వైఎస్ఆర్ ప్రభుత్వంలో సకల శాఖా మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. అధికారికంగా ఆయనకు ఎలాంటి పదవి లేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి లోకేష్ .. సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నారా లోకేష్ మార్క్ పాలన ప్రత్యేకంగా కనిపిస్తోంది. అయితే, ఆయన కేవలం తన అధీనంలో ఉన్న ఐటీ, విద్యా శాఖలకే పరిమితం కాకుండా.. హోం శాఖ, పరిశ్రమలు, మున్సిపల్, శాంతిభద్రతల వరకు ప్రతి అంశంలోనూ చొరవ చూపుతుండటం ఏపీ రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. విపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఆయనను  సకల శాఖా మంత్రి"గా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడిగా, టిడిపి భవిష్యత్ నేతగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

అన్ని శాఖల్లోనూ లోకేష్ ముద్ర         

తాజాగా వినాయక చవితి, నిమజ్జనం వేడుకల సందర్భంగా డీజే వాహనాలకు అనుమతుల విషయంలో నారా లోకేష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. నిమజ్జనంలో డీజే వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకూడదు, అనుమతులు సులభతరం చేయాలి అని హోంమంత్రి  అనిత, డీజీపీలను అభ్యర్థిస్తున్నట్లు లోకేష్ ఎక్స్ వేదికగా కోరారు. అనంతరం హోంమంత్రి అనిత సైతం దీనిపై సానుకూలంగా స్పందించి ఆదేశాలు ఇవ్వడంతో.. తన శాఖ పరిధిలోకి రాని శాంతిభద్రతలు, పోలీసు వ్యవహారాల్లోనూ లోకేష్ ఆదేశించే స్థాయికి వెళ్లారనే విమర్శలు విపక్షాల నుంచి వ్యక్తమయ్యాయి.

పెట్టుబడుల నుంచి దేవాదాయ శాఖ వరకూ..!

కేవలం డీజే పర్మిషన్ల అంశమే కాదు.. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పరిశ్రమల శాఖ కంటే ఐటీ మంత్రిగా లోకేష్ ముందంజలో ఉండటం, వివిధ జిల్లాల సమీక్షల్లో ప్రాజెక్టుల పురోగతిపై నేరుగా ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాలు విమర్శకులకు అస్త్రంగా మారాయి. చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో  నంబర్-2 స్థానాన్ని ఆక్రమించే క్రమంలోనే ఆయన అన్ని శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని, ఇతర మంత్రుల అధికారాలను పరోక్షంగా తన చేతుల్లోకి తీసుకుంటున్నారనే ఆరోపణలను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బలంగా లేవనెత్తుతున్నారు. అయితే ఈ విమర్శలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రభుత్వం అంతే ఘాటుగా సమాధానం ఇస్తున్నాయి. మంత్రిగా ప్రజా సమస్యలపై స్పందించడం చొరవా? లేక అతి చొరవా? అని టిడిపి కౌంటర్ ఇస్తోంది. దశాబ్ద కాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా చూసిన నాయకుడిగా లోకేష్ ప్రజా సమస్యలు ఎక్కడ వచ్చినా స్పందిస్తున్నారని టిడిపి నేతలు సమర్థిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, నిరుద్యోగిత, పెట్టుబడుల అంశాలు ఇతర అన్ని శాఖలతో ముడిపడి ఉంటాయని, ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

బాధ్యతే అంటున్న టీడీపీ 

 

  టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, యువ నాయకుడిగా పార్టీ శ్రేణులకు ,  ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించడం లోకేష్ బాధ్యత అని శ్రేణులు పేర్కొంటున్నాయి. సాధారణ పౌరులు   తమ ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఆయన ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా సహచర హోంమంత్రికి లేదా అధికారులకు సమన్వయం కోసం విజ్ఞప్తి  చేశారే తప్ప ఎక్కడా నిబంధనలను అతిక్రమించేలా శాసించలేదని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. లోకేష్ వేగం ఒకవైపు సమర్థవంతమైన నాయకత్వానికి, స్పందించే గుణానికి అద్దం పడుతోందని ఆయన మద్దతుదారులు అంటుంటే, మరోవైపు అన్ని శాఖల్లో ఆయన జోక్యం రాజ్యాంగబద్ధమైన పాలనా వ్యవస్థకు విరుద్ధమనే వ్యాఖ్యలు విపక్షాల నుండి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో లోకేష్ తన ప్రతిష్టను పెంచుకుంటూనే, తన సొంత శాఖలైన ఐటీ, విద్యా రంగాల్లో సాధించే ఫలితాల ఆధారంగానే ఈ విమర్శలకు పూర్తిస్థాయిలో చెక్ పడే అవకాశముంది.

Click here to Read More
Previous Article
3 స్క్రీన్లతో రానున్న Tata Safari EV.. 600 KM రేంజ్ సహా ఈవీ ఫీచర్లు, అంచనా ధర పూర్తి వివరాలు
Next Article
Raaka Guinness Record : అల్లు అర్జున్ రాకా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ - 37 వెనుక సీక్రెట్ రివీల్... స్పెషల్ వీడియో చూశారా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment