Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా

2 hours ago

Rajinikanth Dharman : మైసూరులో ధర్మన్ మూవీ షూటింగ్‌ సెట్‌కు సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆటోలో ఓ సామాన్యుడిలా వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rajinikanth's Came In Auto For Dharman Shooting : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth) మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నారు. ప్రస్తుతం 'ధర్మన్' (Dharman) షూటింగ్ మైసూరులో జరుగుతుండగా... సెట్‌కు ఓ సాధారణ వ్యక్తిగా ఆటోలో వచ్చారు. లగ్జరీ కారును వదిలేసి కామన్ మ్యాన్ అవతారంలో సింపుల్‌గా తలైవా రావడాన్ని చూసిన సెట్‌లోని వారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

వాట్ ఏ సింప్లిసిటీ తలైవా?

తలైవా సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గతంలోనూ ఆయన ఓ సాధారణ ప్రయాణికుడిలానే విమానంలో అందరితోనూ కలిసి  ప్రయాణించారు. ఇప్పుడు కోట్లాది రూపాయల లగ్జరీ కార్లను వదిలేసి ఆటోలో ప్రయాణించారని కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని అంటున్నారు. సెట్ బయట ఆయన్ను చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు.

 

ఆటో నుంచి దిగుతూ అందరికీ అభివాదం చేస్తూ తలైవా సెట్‌లోకి వెళ్లిపోయారు. అంతకు ముందు ఆయన మైసూరులోని శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. 

ధర్మన్‌లో ఉస్తాద్ బ్యూటీస్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ నిర్మాతగా రజనీ కాంత్ హీరోగా ధర్మన్ మూవీ రాబోతోంది. 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా... రాశీ ఖన్నా (Raashii Khanna) హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreleela) కూడా ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. షూటింగ్ సెట్ నుంచి ఆమె బయటకు నడుస్తూ  వస్తోన్న వీడియో వైరల్ అవుతోంది.

సినిమాలో రజనీకాంత్ పవర్ ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) విలన్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే, సిమ్రాన్, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా... రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment