Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం

1 hour ago

పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం రైతు బజార్లలో కేజీ ఉల్లిపాయలను రూ.35 కే విక్రయించనున్నట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ తెలిపారు.

అమరావతి: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. నిత్యం పెరిగే ధరలతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన ఉల్లిపాయలను బుధవారం (సెప్టెంబర్) నుంచి రాష్ట్రంలోని రైతు బజార్లలో కేజీ రూ. 35 వంతున సబ్సిడీ ధరకు విక్రయించనున్నట్లు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 

కూటమి ప్రభుత్వం చేపట్టిన ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, మొదటి విడతలో భాగంగా విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల చొప్పున సబ్సిడీ ఉల్లిపాయలను విక్రయించనున్నారు. 
అయితే లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును చూపించి ఉల్లిపాయలను పొందేందుకు అధికారులు అవకాశం కల్పించారు. విజయవాడలో ప్రజా స్పందన, డిమాండ్‌ను బట్టి ఈ సబ్సిడీ విక్రయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లకు త్వరలోనే విస్తరిస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఉల్లి ధరల భారాన్ని తగ్గించి, ధరల స్థిరీకరణ చేసి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు కోరారు.

Click here to Read More
Previous Article
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Next Article
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment