Surya Tej: రచయితగా మారిన సూర్య తేజ్... 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' తర్వాత నితిన్ గడ్కరీపై!?

1 hour ago

Surya Tej Meets Nitin Gadkari: నటుడిగా, హీరోగా మెప్పించిన సూర్య తేజ్, కొత్త అవతారం ఎత్తారు. రచయితగా మారి 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' రాశారు. త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై బుక్ రాయనున్నారు.

నటుడిగా, కథానాయకుడిగా చిత్రసీమలో ప్రవేశించి మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేసిన ఆరిస్టులు మన తెలుగు చిత్రసీమలో ఉన్నారు. సినిమాలకు కథలు అందించిన వాళ్ళు కూడా ఉన్నారు. దర్శకులుగా వచ్చి హీరోలుగా, నటులుగా మారిన టెక్నీషియన్లు కూడా ఉన్నారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... పుస్తక రచయితగా మారారు నటుడు సూర్య తేజ్ (Surya Tej). ఆయన ఓ బుక్ రాశారు. త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)పై బుక్ రాయనున్నారు.

'శంభో శివ శంభో' నుంచి 'అప్పుడిలా' వరకు!
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'శంభో శివ శంభో'లో సూర్య తేజ్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 'వినాయకుడు'లో సెకండ్ హీరో రోల్ చేశారు. అందులోని నటనకూ మంచి పేరు వచ్చింది. అక్కడ నుంచి 'అప్పుడిలా ఇప్పుడిలా' సినిమాలో హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన రచయితగా మారారు.

రచయితగా కొత్త ప్రయాణం గురించి సూర్య తేజ్ మాట్లాడుతూ... ''ఈ ప్రయాణం ప్రారంభించడం నా జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. 'శంభో శివ శంభో' రీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది'' అని చెప్పారు.

రచయితగా తన తొలి పుస్తకం 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' గురించి సూర్య తేజ్ మాట్లాడుతూ... ''నాగపూర్ సిటీలో ఎంతో పవిత్రమైన 'తేక్డి గణపతి' వైభవాన్ని, చరిత్రను పుస్తక రూపంలో తీసుకు వచ్చిన మొదటి రచయితగా నిలవడం నా అదృష్టం. ఇప్పటి వరకు తెక్డి గణపతిపై బుక్ రాలేదు. ప్రపంచంలో ఇదే మొదటిది. సంప్రదాయ కథనానికి భిన్నంగా రాసిన పుస్తకమిది. ఇది డివోషనల్ బుక్ కాదు... జీవితాన్ని ప్రాక్టికల్‌గా చూపించే పుస్తకమిది. గణపతి అంటే జ్ఞానం. ఓర్పు, జ్ఞానంతో సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పే మార్గదర్శి ఇది'' అని చెప్పారు. సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ చేతుల మీదుగా ఈ పుష్కరాన్ని ఆవిష్కరించారు.

నితిన్ గడ్కరీపై త్వరలో బుక్ రానుందా?
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సూర్య తేజ్ సన్నిహితంగా మెలుగుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవేశపెట్టిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో రైతులు, గ్రామీణ యువత ఆర్థికంగా ఉన్నత స్థాయికి రావడానికి ఉపయోగపడే భారతీయ విధానాలపై మరిన్ని పుస్తకాలను తీసుకురాబోతున్నానని సూర్య తేజ్ చెప్పారు.

సినిమాల విషయానికి వస్తే... సూర్య తేజ్ హీరోగా నటించిన 'అప్పుడలా ఇప్పుడిలా' అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో 'పర్ఫెక్ట్ బిజినెస్ మాన్'గా ఆ సినిమా డబ్బింగ్ అయ్యింది. యూట్యూబ్‌లో పదకొండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానమైన స్కిల్ డెవలప్‌మెంట్, ఉన్నత విద్యా రంగంతో కలిసి సూర్య తేజ్ పని చేస్తున్నారు. శాక న్యోరా సొల్యూషన్స్ సంస్థకు కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Click here to Read More
Previous Article
Power House: క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?
Next Article
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment