AP Cabinet social media influencer policy: సోషల్ మీడియాలో 10K ఫాలోవర్లు ఉన్నారా? ఏపీ ప్రభుత్వం నుంచి నెలకు రూ.15,000 వరకు సంపాదించే ఛాన్స్!

1 hour ago

Digital Creator Monetization: ఏపీ ప్రభుత్వం కొత్త సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా రూ.2,500 నుండి రూ.15,000 వరకు సంపాదించే అవకాశం కల్పిస్తోంది.

AP IPR social media guidelines 10k followers earnings:  సోషల్ మీడియా క్రియేటర్లకు , ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ యుగానికి తగినట్లుగా ఒక సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలనాపరమైన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు,  ప్రజలకు ఉపయోగపడే అత్యవసర సమాచారాన్ని క్షేత్రస్థాయిలోకి వేగంగా చేరవేసే లక్ష్యంతో  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ కి ఏపీ కేబినెట్ అధికారిక ఆమోదం తెలిపింది. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా యువతకు, సామాన్యులకు వేగంగా రీచ్ లభిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త విధానం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య ప్రాతిపదికన క్రియేటర్లను ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. 10 వేల నుంచి 24,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారిని ప్రారంభ కేటగిరీగా గుర్తించి రూ.2,500 వరకు, 25 వేల నుంచి 49,999 ఫాలోవర్లు ఉన్నవారికి రూ.5,000 వరకు చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా 50 వేల నుంచి 99,999 ఫాలోవర్లు ఉన్న మీడియం క్రియేటర్లకు రూ.7,500 వరకు, లక్ష అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న టాప్ క్రియేటర్లకు గరిష్ఠంగా రూ.15,000 వరకు ప్రతిఫలం అందించనున్నారు.
అయితే, కేవలం భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన అందరికీ ఈ అవకాశం దక్కదు. పారదర్శకతను కాపాడటానికి , నకిలీ   ఖాతాలను అరికట్టడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన ప్రమాణాలను నిర్దేశిస్తోంది. అకౌంట్   ఆర్గానిక్ రీచ్, పోస్ట్ చేసే కంటెంట్ నాణ్యత, ఎంగేజ్‌మెంట్ రేట్ ,  ఖాతాదారుడి విశ్వసనీయత వంటి ముఖ్యాంశాలను నిపుణుల బృందం సమగ్రంగా పరిశీలిస్తుంది. విశ్వసనీయమైన కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ప్రభుత్వ సమాచార ప్రచార బాధ్యతలను అప్పగిస్తారు.   
ఈ నిర్ణయంతో సోషల్ మీడియా కేవలం వ్యక్తిగత వినోదానికి లేదా సాధారణ కంటెంట్ మేకింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఒక అధికారిక ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలో భాగస్వామిగా మారుతోంది. స్థానిక డిజిటల్ క్రియేటర్లకు, కంటెంట్ తయారీనే నమ్ముకున్న యువతకు ఇది ఒక మంచి ఆర్థిక ప్రోత్సాహకంగా నిలవడమే కాకుండా, వారి నైపుణ్యాలకు ప్రభుత్వ గుర్తింపు లభించినట్లవుతుందని ఐటీ సమాచార  నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Click here to Read More
Previous Article
Magnesium Deficiency : నిద్రలోపానికి మెగ్నీషియం కూడా కారణమే.. లోపాన్ని తగ్గించుకునేందుకు ఈ ఫుడ్స్ తినండి
Next Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: త్యాగాలు.. ఎమోషన్లు.. ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ఇదో మినీ ఫ్యామిలీ వీక్!

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment