Hyderabad Tank Bund hit and run case: ట్యాంక్‌బండ్‌పై ఘోరం - ఎస్‌ఐని ఢీకొట్టి పారిపోయిన వ్యక్తులు - మృతి - క్లియర్‌గా సీసీ కెమెరా దృశ్యాలు!

1 hour ago

Tank Bund hit and run case: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఘోరం. నిమజ్జన బందోబస్తులో ఉన్న కొత్తగూడెం ఎస్‌ఐ వెంకన్నను స్కూటర్ ఢీకొట్టడంతో మృతి. వారు పరారు కావడంతో గాలిస్తున్నారు.

SI killed Tank Bund accident:  హైదరాబాద్‌లో నిమజ్జనాల పర్యవేక్షణ కోసం వచ్చిన ఒక పోలీసు అధికారి ఘోర  ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం  విషాదాన్ని నింపింది. గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్  రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదం దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా, వాహనం నడుపుతున్న వ్యక్తి ఆపకుండా పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

మృతుడిని కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న కే. వెంకన్న గా గుర్తించారు. నిమజ్జన మహోత్సవం సందర్భంగా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ , ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పర్యవేక్షణ కోసం ఈయనను హైదరాబాద్‌కు డిప్యుటేషన్‌పై పంపించారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో విధి నిర్వహణలో భాగంగా రోడ్డు దాటుతున్న సమయంలో ఈ  ప్రమాదం  జరిగింది. 
అత్యంత వేగంగా వచ్చిన స్కూటర్ ఎస్‌ఐ వెంకన్నను బలంగా ఢీకొట్టడంతో ఆయన రోడ్డుపై తీవ్రగాయాలతో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడం ,  అధిక రక్తంస్రావం జరగడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కొత్తగూడెం పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.   ప్రమాదానికి కారణమైన స్కూటర్ ప్రయాణికులు వెంకన్న కిందపడిపోయినా కనీసం వాహనాన్ని ఆపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వాహనం నంబర్‌ను , నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Click here to Read More
Previous Article
The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?
Next Article
DA For Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment