AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

1 day ago

ఏపీలో నాన్-యూనిఫాం ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 నుండి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.

AP Government Jobs 2026 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ చేసే నాన్-యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన గరిష్ట వయోపరిమితిని ఏడాదిపాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది.

యూనిఫాం పోస్టులకు ఏ మార్పు లేదు
అయితే పెంచిన ఈ వయోపరిమితి సడలింపు కేవలం నాన్-యూనిఫాం పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు ఈ పెంపు వర్తించదని అధికారులు తెలిపారు. కాగా, ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఈడబ్ల్యూఎస్ (EWS) తదితర కేటగిరీల అభ్యర్థులకు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం లభించే అదనపు వయోపరిమితి మినహాయింపులు యథావిధిగా వర్తిస్తాయని తెలిపింది.

Click here to Read More
Previous Article
Best Bikes Under Rs 1 Lakh: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి
Next Article
Samantha : ఘనంగా సమంత సీమంతం సెలబ్రేషన్స్ - భర్త రాజ్, ఫ్యామిలీ మెంబర్స్‌తో క్యూట్ మూమెంట్స్

Related జాబ్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment