Best Bikes Under Rs 1 Lakh: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి

1 day ago

Bikes Price Under Rs 1 Lakh : మీరు తక్కువ ధరలో, రోజువారీ వినియోగానికి బైక్ కావాలనుకుంటే TVS Star City Plus తో పాటు Bajaj Platina 110 వంటి మోడళ్లను ఓసారి చెక్ చేసుకోండి.

Best Bikes In India | మీరు బైక్ కొనాలని కోరుకుంటూ, రూ. 1 లక్ష రూపాయల వరకు మీ బడ్జెట్ ఉంటే గణేశ చతుర్థీ సందర్భంగా ఈ సెగ్మెంట్‌లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. రోజూ ఆఫీస్, మార్కెట్ లేదా ఇతర చిన్నచిన్న పనుల కోసం బైక్‌ను కోరుకుంటే, తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్, సులభమైన మెయింటెనెన్స్, నాణ్యమైన ఇంజిన్ చాలా ముఖ్యం. అందుకోసం Honda, TVS, Bajaj తో పాటు Hero కంపెనీలకి చెందిన ఇలాంటి బైక్‌ల గురించి మీకు వివరిస్తున్నాం.  

హోండా షైన్ 125 (Honda Shine 125)

 మీరు కొరుకునే జాబితాలో మొదటి ఆప్షన్ Honda Shine 125 బైక్. ఇందులో 123.9cc ఇంజిన్ ఇస్తారు. బైక్ సుమారు 10.5hp పవర్, 11Nm టార్క్ ఇస్తుంది. ఈ బైక్ రోజూ ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. 

బైక్ ఇంజిన్ సిటీలో రైడ్‌కు సరిపడే పవర్‌ను అందిస్తుంది. అలాగే ఆఫీస్‌కు వెళ్లడం, మార్కెట్ పనులు లేదా రోజువారీ ప్రయాణాల కోసం ఈ బైక్‌ సరిపోతుంది. బైక్‌లో డిజిటల్ డ్యాష్, ట్యూబ్‌లెస్ టైర్లు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 82,250 నుంచి ప్రారంభమవుతుంది. ఆయా నగరాలు, రాష్ట్రాల్లో ధరలు భిన్నంగా ఉంటాయి.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus)

తక్కువ బడ్జెట్‌లో కోరుకునే వారికి TVS Star City Plus కూడా ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ. 72,200 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 109.7cc ఇంజిన్ లభిస్తుంది. సుమారు 8.1hp పవర్, 8.7Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ సులభమైన, చవకైన రైడ్‌ కోసం ఉపయోగిస్తారు. ఇందులో LED హెడ్‌లైట్, USB ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు లభిస్తాయి. బైక్‌లో ఎకో లైట్ కూడా ఇచ్చారు. ఇది ఇంధనం ఆదా చేసే రైడింగ్‌లో హెల్ప్ కావచ్చు. అందువల్ల తక్కువ బడ్జెట్‌లో ఇది బెస్ట్ అవుతుంది.  

బజాజ్ ప్లాటినా 110 (Bajaj Platina 110)

తక్కువ ధర, రోజువారీ సౌకర్యవంతమైన ప్రయాణం మీ ప్రాధాన్యం అయితే Bajaj Platina 110 కూడా ఒక మంచి ఆప్షన్ కానుంది. ఇందులో 115.45cc ఇంజిన్ ఇస్తారు. ఇది సుమారు 8.60hp పవర్, 9.81Nm టార్క్ ఇస్తుంది. దీనితో పాటు 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. బైక్ వెనుక భాగంలో స్ట్రాంగ్ స్ప్రింగ్స్ ఇచ్చారు. ఇవి గుంతల రోడ్లపై వచ్చే షాక్‌లను తట్టుకోవడంలో సహాయపడతాయి.

సుమారు 69,284 రూపాయలు ధరతో బైక్ ప్రారంభమవుతుంది. తక్కువ ధర కారణంగా, బైక్‌ను రోజువారీ రాకపోకల కోసం ఉపయోగిస్తుంటారు. 

బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125)

1 లక్ష రూపాయల బడ్జెట్‌లో స్పోర్టీ లుక్‌, మంచి పవర్ ఉన్న బైక్‌ను కోరుకుంటే Bajaj Pulsar 125 తీసుకోవచ్చు. ఇందులో 124.4cc ఇంజిన్ ఇస్తారు. ఇది సుమారు 11.8hp పవర్, 10.8Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఎక్కువ పవర్ ఇచ్చే బైక్. దీని ధర 79,048 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దీని డిజైన్ కూడా కమ్యూటర్ బైక్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా.. బెస్ట్ టుక్ ఉంటుంది. లుక్, పనితీరు కూడా కోరుకునేవారికి ఇది ఆప్షన్ కావచ్చు.

హీరో సూపర్ స్ప్లెండర్ (Hero Super Splendor XTEC)

 ఈ బడ్జెట్‌లో వచ్చే ప్రధాన బైక్ Hero Super Splendor XTEC. దీని ధర సుమారు 86,128 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 124.7cc ఇంజిన్ లభిస్తుంది. ఇది సుమారు 10.7hp పవర్, 10.6Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు.

ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Bluetooth కనెక్టివిటీ, ఫుల్ LED హెడ్‌లైట్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. Bluetooth ద్వారా కాల్, SMS అలర్ట్‌ల వంటి సమాచారం చూడవచ్చు. కమ్యూటర్ బైక్‌తో పాటు మోడ్రన్ ఫీచర్లు కోరుకునే వారికి  సెట్ అవుతుంది. 

లక్ష రూపాయల బడ్జెట్‌లో మీకు ఏ బైక్ మంచిది?

మీరు తక్కువ ధరలో, రోజువారీ జర్నీకి బైక్ కావాలనుకుంటే Bajaj Platina 110, TVS Star City Plus వంటి మోడళ్లు బాగుంటాయి. అదే ఎక్కువ పవర్, స్పోర్టీ డిజైన్ కావాలంటే Bajaj Pulsar 125 బెస్ట్ ఆప్షన్ కావచ్చు. బ్యాలెన్స్‌డ్ కమ్యూటర్ బైక్ కోరుకునే వారు Honda Shine 125ను చూడవచ్చు. ఫీచర్లపై ఫోకస్ చేసేవారు Hero Super Splendor XTEC పై ఓ లుక్కేయండి. 

Click here to Read More
Previous Article
Vijay Ajith : అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
Next Article
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment