Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చరణ్ రీ ఎంట్రీ..! రావడం రావడమే త్రిగుణ్‌ని టార్గెట్ చేశాడా! కంటెస్టెంట్స్ ఆలోచన ఇదే!

2 hours ago

Bigg Boss Season 10 Day 10: చరణ్ ఈ ఎంట్రీ ఇవ్వడం.. కెప్టెన్సీ కంటెండర్ కోసం త్రిగుణ్‌తో పోటీ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10లో 10వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏడ్చేసిన దేబ్‌జానీ

రోహిత్, దేబ్‌జానీ, ముకేశ్ నిన్న రోహిత్, దేబ్జానీ ఆడిన ఆట గురించి మాట్లాడుకుంటారు. ఆ గేమ్ గురించే త్రిగుణ్ కూడా వర్షిణితో మాట్లాడుతాడు. ఇక ఓడిపోయినందుకు దేబ్‌జానీ చాలా ఏడుస్తుంది. నువ్వు, రోహిత్ చాలా బాగా ఆడారు అని షాలిని చెప్తుంది. తర్వాత ముకేశ్, సుధీర్, వర్షిణి, అమన్, నరేశ్ ఒకే చోట కూర్చొంటార. వర్షిణి ముకేశ్‌ని చూడదు. దాంతో మిగతా వాళ్లు కావాలనే వర్షిణితో ముకేశ్ గురించి మాట్లాడిస్తారు. తర్వాత వర్షిణి ముకేశ్‌ని చూసి షాక్ అయిపోతుంది. ఇక త్రిగుణ్ షాలిని తనకు అస్సలు నచ్చదు అని వర్షిణి వాళ్లతో చెప్తాడు.

 

ఊ అంటావా మామా..

ఉదయం కంటెస్టెంట్స్ అందరూ ఊ అంటావా మామ ఉఊ అంటావా అంటూ డ్యాన్స్ వేస్తారు. ఇక త్రిగుణ్, షాలిని కెమెరా ముందు ఒకరు యాక్షన్ చేస్తూ ఒకరు మాటలు చెప్తూ మేం మీకు ఎంటరైటైన్ చేస్తాం మీరు మాకు ఓటు వేయండి అని సరదాగా చెప్తారు. ఫుడ్ టైంకి ఉండాలి అని ముకేశ్‌ షాలినితో చెప్తాడు. వంశీ నిన్ను వర్షిణితో ఫుడ్ గురించి పడిన గొడవ గురించి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతాడు. తినేటప్పుడు ఇలా మాట్లాడితే ఏదోలా ఉంది అని వర్షిణి ఏడుస్తుంది. తర్వాత వంశీ వర్షిణితో మాట్లాడి వివరిస్తాడు. 

 

గేమ్ మొదలు..

కెప్టెన్సీ రేస్ మొదలవుతుంది. ఇందులో నిన్ను కెప్టెన్సీ టాస్క్‌లో నిలిచిన త్రిగుణ్, రాంప్రసాద్‌, దేబ్‌జానీలకు గేమ్ పెడతారు. ముగ్గురు డిస్క్‌లకు సంబంధించిన గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో దేబ్జానీ బాగా ఆడినప్పటికీ ఓ టేబుల్ మీద డిస్క్‌లు విసరడంతో దేబ్‌జానీ ఫెయిల్ అవ్వడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటుంది. ఈ గేమ్‌లో సంచాలకుడైన నరేశ్ రాంప్రసాద్, త్రిగుణ్ విన్ అయ్యారు అని చెప్తాడు. 

 

చరణ్ ఎంట్రీ..

కంటెస్టెంట్స్ అందర్ని బిగ్‌బాస్ బయటకు పిలిచి చరణ్‌ ఎలిమినేట్ అయిన థీమ్ ఏర్పాటు చేసి అందులో శవపేటిక పట్టుకున్న షాలినిని బయటకు తీసుకెళ్తారు. అందరూ షాలిని ఎలిమినేట్ అనుకుంటారు. కానీ చరణ్ ఎంట్రీ ఇస్తాడు. బిగ్‌బాస్ చరణ్‌కి బయట నుంచి గేమ్ చూశారు కదా అందరి పవర్స్ మీకు తెలుసు కదా ఎవరితో పంచుకోవద్దు అని చెప్తారు. చరణ్ ఇంటి సభ్యులు అందరితో మాట్లాడుతాడు. ఇంటి సభ్యులు మొత్తం చరణ్‌కి గేమ్ తెలుసు అని కొత్త కొత్త ప్లాన్స్‌తో వచ్చుంటాడు అని అనుకుంటారు. 

 

నరేశ్ యాక్షన్ అదుర్స్..

అమన్, కృష్ణుడు, రాంప్రసాద్, సుధీర్, వర్షిణి, దేబ్‌జానీ, ఝాన్సీ, ముకేశ్, నరేశ్ బయట కూర్చొని ఉంటారు. నరేశ్ ఇంట్లో అందరి గురించి చెప్తూ ఇమిటేట్ చేస్తాడు. ఇక రాంప్రసాద్ అయితే అమన్ నడకని ఇమిటేట్ చేస్తారు, తర్వాత ముకేశ్‌లా నడుస్తాడు. ఇద్దరూ కలిసి ర్యాంప్ వాక్‌లా నడుస్తారు.

 

త్రిగుణ్‌కి ఆ అర్హత లేదు..

చరణ్‌కి బిగ్‌ బాస్ రెండు ఆప్షన్లు ఇస్తారు. మొదటిది ఉన్న కెప్టెన్సీ కంటెస్టెంట్స్‌లో ఒకరిని కంటెండర్ రేసు నుంచి తొలగించే హక్కు ఉంటుంది కానీ మీరు కంటెండర్ అవ్వరుఅని చెప్తారు. రెండో ఆప్షన్‌గా ఒకరిని ఛాలెంజ్ చేస్తే వాళ్లు ఓడిపోయి మీరు గెలిస్తే కంటెండర్ అవుతారు అని చెప్తారు. దాంతో చరణ్ రెండో ఆప్షన్ ఎంచుకుంటా అని చెప్పి త్రిగుణ్‌ని ఛాలెంజ్ చేస్తాడు. త్రిగుణ్ ఎక్కువ మాట్లాడుతాడు. కెప్టెన్ అయ్యే అర్హత లేదు అని చెప్పి త్రిగుణ్‌తో పోటీ పడతా అని చెప్తాడు.

 

పాథ్ ఆఫ్ వార్..
బిగ్‌బాస్ చరణ్, త్రిగుణ్‌కి పాథ్ ఆఫ్ పవర్ గేమ్ పెడతారు. ఓ నిచ్చెనలో రంగు ప్లేట్స్ పెట్టాలని అయితే ఈ నిచ్చెన నాలుగు కలర్లు ఇచ్చి వాటిని పెట్టమని అంటారు. అయితే చరణ్ స్మార్ట్‌గా ఆడుతాడు. రాంప్రసాద్ ముందు చరణ్ విన్ అని చెప్తాడు. తర్వాత రూల్స్ అన్నీ ఫాలో అవ్వలేదు అని త్రిగుణ్‌ని విన్ అని చెప్తాడు. చరణ్ తెలివి చూపించా అనుకున్నాడు కానీ అతి తెలివి చూపించాడు అని ముకేశ్, జాన్సీ అనుకుంటారు. రాంప్రసాద్ ఈ గేమ్ సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాను అని చాలా కంగారుగా ఉందని చెప్తాడు. ఇక ఈ విషయం మీద దేబ్జానీ రాంప్రసాద్‌ మీద సీరియస్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Click here to Read More
Previous Article
Revanth Reddy political strategies: రేవంత్ వ్యూహాల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ - ఫామ్‌హౌస్ విచారణ - కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన సమయమొచ్చిందా?
Next Article
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్

Related బిగ్‌ బాస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment