Revanth Reddy political strategies: రేవంత్ వ్యూహాల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ - ఫామ్‌హౌస్ విచారణ - కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన సమయమొచ్చిందా?

2 hours ago

KCR Active Politics: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం. 22A నుండి కేసీఆర్ భూముల విచారణ వరకు రేవంత్ వేసిన పొలిటికల్ ట్రాప్, బీఆర్ఎస్ వైఫల్యం కనిపిస్తోంది. కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనా?

Erravalli Farmhouse Probe Revanth Strategy:   తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వేస్తున్న రాజకీయ అడుగులు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి  కి పెద్ద అగ్నిపరీక్షగా మారుతున్నాయి. ప్రజా సమస్యలు, పాలనా లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ప్రయత్నించిన ప్రతిసారీ.. సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అజెండాను అకస్మాత్తుగా మార్చేసి ప్రతిపక్షాన్ని డిఫెన్స్‌లోకి నెట్టడంలో విజయం సాధిస్తున్నారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన వివాదాన్ని దళిత ఆత్మగౌరవ అంశంగా మలచడం నుంచి, 22A నిషేధిత భూముల చర్చను నేరుగా  కేసీఆర్ కుటుంబ భూములపై విచారణ  వైపు తిప్పడం వరకు రేవంత్ వ్యూహాత్మక  అజెండా పాలిటిక్స్ నడిపిస్తున్నారు.

సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు       

ఈ పొలిటికల్ ట్రాప్‌లో చిక్కుకుని అసెంబ్లీ సభ నుంచి కేటీఆర్ సహా ప్రధాన బీఆర్ఎస్ నాయకులు వరుసగా సస్పెండ్ కావడంతో, ప్రతిపక్షం ఫీల్డ్‌లో ఉండి శాసనసభ వేదికగా లేవనెత్తాల్సిన ప్రజా సమస్యల అజెండా మూలనపడింది. సభలో సీఎం సుదీర్ఘ ప్రసంగం చేస్తూ, రికార్డులను బహిర్గతం చేస్తూ, రెవెన్యూ విచారణలకు ఆదేశిస్తుంటే.. దానికి సభ లోపల నుంచి సమర్థవంతమైన రీ-కౌంటర్ ఇవ్వలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయట పడిపోవడం రేవంత్ రెడ్డి నైతిక విజయాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రత్యర్థి వ్యూహాన్ని ముందుగా అంచనా వేసి కౌంటర్ అజెండాను సిద్ధం చేసుకోవడంలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం విఫలమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 డైవర్షన్ అండ్ అటాక్  గేమ్‌

ప్రధానంగా, రేవంత్ రెడ్డి ఆడుతున్న  డైవర్షన్ అండ్ అటాక్  గేమ్‌ను తిప్పికొట్టడంలో కేటీఆర్, హరీష్ రావుల ప్రతిదాడి తాత్కాలిక మీడియా సమావేశాలకే పరిమితమవుతోంది. శాసనసభ వేదికపైకి రాకుండా కేవలం తెలంగాణ భవన్‌కు పరిమితమై ఇచ్చే స్పష్టతలకు, అధికారికంగా ప్రభుత్వ రికార్డుల ప్రాతిపదికన సీఎం చేసే ప్రకటనలకు మధ్య ఉన్న రాజకీయ ప్రాధాన్యతలో చాలా తేడా ఉంది. ప్రభుత్వం తమనే లక్ష్యంగా చేసుకుని విచారణల వల పన్నుతున్నప్పుడు, దానికి సమాంతరంగా ప్రజల్లోకి వెళ్లే క్రమశిక్షణతో కూడిన వ్యూహం లోపించడం వల్ల బీఆర్ఎస్ క్షేత్రస్థాయి శ్రేణులు కూడా కొంత ఆత్మరక్షణలో పడుతున్నాయి.

కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనా? 

ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు  స్వయంగా ఫీల్డ్‌లోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేవలం కేటీఆర్, హరీష్ రావుల పోరాటంతో రేవంత్ రెడ్డి విసురుతున్న రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన బాణాలను పూర్తిగా తిప్పికొట్టడం కష్టమనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ స్వయంగా ప్రజల్లోకి వచ్చి ,  మీడియా వేదికగా రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా, తనదైన మార్క్ శైలిలో తిప్పికొడితే తప్ప గులాబీ శ్రేణుల్లో మళ్లీ పాత ఉత్సాహం నింపడం సాధ్యపడదు. ఈ వ్యూహాత్మక పోరాటంలో బీఆర్ఎస్ తన విధానాన్ని తక్షణమే మార్చుకోవాల్సి ఉంది. అధికార పక్షం విసిరే వివాదాల ఉచ్చులో చిక్కుకుని అసెంబ్లీ బహిష్కరణలు, సస్పెన్షన్లకు గురికాకుండా.. రేవంత్ సర్కార్ లేవనెత్తుతున్న ప్రతి అంశానికి పక్కా రికార్డులతో సభలోనే ఎదురుదాడి చేయాల్సి ఉంది.  

రేవంత్‌ను ఎదుర్కోవాలంటేకేసీఆర్ రావాల్సిందే!

 

30 రోజుల ఎర్రవల్లి భూముల విచారణ ముగిసేలోగా బీఆర్ఎస్ గనుక రాజకీయంగా పుంజుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ ఈ భూముల వివాదాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రమాదం ఉంది.  తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ప్రత్యక్ష సమరానికి సమయం ఆసన్నమైంది. రేవంత్ వేస్తున్న వ్యూహాత్మక పాచికలను తిప్పికొట్టే రాజకీయ చతురత, తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం కేసీఆర్ దగ్గరే ఉన్నాయి. మరి గులాబీ అధినేత ఎప్పుడు ఫామ్‌హౌస్ దాటి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ పొలిటికల్ నెరేటివ్‌ను తనవైపు తిప్పుకుంటారో వేచి చూడాల్సిందే.   

Click here to Read More
Previous Article
Keesara Police Station ACB Trap: కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!
Next Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చరణ్ రీ ఎంట్రీ..! రావడం రావడమే త్రిగుణ్‌ని టార్గెట్ చేశాడా! కంటెస్టెంట్స్ ఆలోచన ఇదే!

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment