Crime Thriller OTT : 18 ఏళ్ల తర్వాత హిట్ జోడీ - 'కొత్త బంగారు లోకం' బాలు, స్వప్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

5 hours ago

Psychological Thriller OTT : వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ 18 ఏళ్ల తర్వాత ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కలిసి నటించబోతున్నారు. దీనికి సంబంధించి గ్లింప్స్ హైప్ క్రియేట్ చేస్తోంది.

Varun Sandesh's Psychological Thriller My Wife Missing Web Series OTT Platform : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ వరుసగా ఓటీటీ సిరీస్‌లతో అదరగొడుతున్నారు. రీసెంట్‌గా ఆయన ప్రధాన పాత్రలో నటించిన నయనం సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు మరో క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే... 18 ఏళ్ల క్రితం వచ్చిన యూత్ ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'కొత్త బంగారు లోకం'తో సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్. ఇప్పుడు మళ్లీ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం ఇన్నేళ్ల తర్వాత మళ్లీ జత కడుతున్నారు. 

క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

రీసెంట్‌గా జరుగుతున్న రియల్ క్రైమ్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పచ్చని కాపురాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ప్రేమించిన వారి కోసం భర్తలనే కొందరు భార్యలు దారుణంగా చంపేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు భర్తలు కూడా ప్రియురాళ్లతో పాటు భార్యలను కూడా మిస్ చేసి చంపేస్తున్నారు. ఇలాంటి ట్రెండింగ్ కథనంతో ఎక్స్‌క్లూజివ్‌గా రాబోతోన్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'నా వైఫ్ మిస్సింగ్' (Na Wife Missing).

ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా దీనికి సంబంధించి గ్లింప్స్ హైప్ క్రియేట్ చేస్తోంది. బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా వర్క్ చేసే బాలు (వరుణ్ సందేశ్)... తన వైఫ్ స్వప్న (శ్వేతా బసు ప్రసాద్) మిస్ అయ్యిందంటూ పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. అసలు స్వప్న ఏమైంది? బాలునే మిస్ చేశాడా? లేదంటే ఆమె ఎవరితోనైనా వెళ్లిపోయిందా? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహిస్తుండగా... వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌లతో పాటు ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీ ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

2008లో వచ్చిన కొత్త బంగారు లోకం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మంచి యూత్ ఫుల్ లవ్ కంటెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించారు. ఈ మూవీతో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ బెస్ట్ జోడీ అనిపించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా మారారు. కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరమైన శ్వేతా బసు ప్రస్తుతం బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లతో బిజీగా మారారు. ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం వరుణ్, శ్వేతా జత కడుతున్నారు. కొత్త బంగారు లోకంలో వీరి రోల్స్ పేర్లే ఈ సిరీస్‌లోనూ ఉన్నాయి.

Click here to Read More
Previous Article
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Next Article
Ranabaali Documentary Series : రణబాలి నుంచి బిగ్ సర్ప్రైజ్ - నాలుగు ఎపిసోడ్స్‌తో డాక్యుమెంటరీ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment