Ranabaali Documentary Series : రణబాలి నుంచి బిగ్ సర్ప్రైజ్ - నాలుగు ఎపిసోడ్స్‌తో డాక్యుమెంటరీ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

5 hours ago

Ranabaali Documentary : విజయ్ దేవరకొండ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ రణబాలి నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. రిలీజ్‌కు ముందు డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేయనున్నారు.

Ranabaali Documentary Series To Streaming On Youtube : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి (Ranabaali). ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా... పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

డాక్యుమెంటరీ సిరీస్‌గా...

రెండేళ్ల మూవీ జర్నీని నాలుగు ఎపిసోడ్స్‌తో డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. 'రెండేళ్ల పరిశోధన. 150 ఏళ్ల మరుగునపడిన చరిత్ర. మనకు చెప్పింది కేవలం ఓ కథనం మాత్రమే. జరిగింది అంతకంటే చాలా ఘోరమైనది. 

 

ఇప్పుడు, పూడ్చిపెట్టబడి, మరచిపోయి, ఎన్నడూ ప్రస్తావించబడని ఆ రహస్యాలను వెలికితీయడానికి మనం వెనక్కి వెళ్తున్నాం. చరిత్రలో ఒక భాగం. గుర్తుంచుకోవాల్సిన ఒక కథ. ఎన్నడూ మరచిపోకూడని ఒక సత్యం. రణబాలి మరుగవ్వవద్దు. 4 భాగాల డాక్యు సిరీస్. సెప్టెంబర్ 28న ఫస్ట్ పార్ట్ స్ట్రీమ్ అవుతుంది.' అంటూ రాసుకొచ్చారు. హిస్టరీలో కనుమరుగైన, భయంకర ఘట్టాలను ఇప్పటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ డాక్యుమెంటరీ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజైన ఏందయ్యా సామి సాంగ్‌తో పాటు టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రణబాలిగా విజయ్, ఆయన భార్య జయమ్మగా రష్మిక లుక్స్ అదిరిపోయాయి. వీరితో పాటే ఆర్నాల్డ్ వోస్లో విలన్ రోల్ చేశారు. అజయ్ అతుల్ మ్యూజిక్ అందించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది.

కథ 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా రణబాలి స్టోరీ ఉంటుందని టీజర్‌ను బట్టి అర్థం అవుతోంది. బ్రిటిష్ వారి కాళ్ల కింద పడి నలిగిపోయిన ఇండియన్స్‌ కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతం చుట్టూ కథ తిరుగుతోంది. ఇలాంటి టైంలో ఆ ప్రాంత వాసులకు అండగా నిలుస్తాడు శింగనమల బొబ్బిలి రణబాలి. బానిసత్వం నుంచి వారికి రక్షణ కల్పించి వారియర్‌గా బ్రిటిష్ వారితో పోరాడతాడు. ఆ పోరాట యోధుడి కథ రణబాలి.

Click here to Read More
Previous Article
Crime Thriller OTT : 18 ఏళ్ల తర్వాత హిట్ జోడీ - 'కొత్త బంగారు లోకం' బాలు, స్వప్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Next Article
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment