Danam Nagender mind game: దానం నాగేందర్ బిగ్ మైండ్ గేమ్ - ఖైరతాబాద్ ఉపఎన్నిక వేళ మంత్రి పదవి షరతు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు షాక్!?

5 hours ago

Khairatabad bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక వేళ దానం నాగేందర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. . కాంగ్రెస్ తరఫున పోటీపై స్పష్టత ఇవ్వకపోవడం వెనుక మంత్రి పదవి డిమాండ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Danam Nagender Congress minister post demand 2026:   సుప్రీంకోర్టు అనర్హత తీర్పు వెలువడిన మరుక్షణమే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పొలిటికల్ మైండ్ గేమ్  స్టార్ట్ చేశారు. తీర్పును స్వాగతిస్తున్నానని చెప్తూనే.. ఉపఎన్నికలో ఏ పార్టీ తరఫున బరిలోకి దిగేది త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో  కలకలం రేపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ బి-ఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం వల్లే ఆయనపై అనర్హత వేటు పడింది. అలాంటి పరిస్థితుల్లోనూ తాను కాంగ్రెస్ పార్టీ తరఫునే మళ్లీ పోటీ చేస్తానని నేరుగా చెప్పకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.

గెలిచినా,ఓడినా మంత్రి పదవి ఖరారు చేయాల్సిందేనా?          

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ పేరును డైరెక్ట్‌గా ప్రస్తావించకపోవడం వెనుక ఒక ప్రధానమైన డిమాండ్ ఉందని  భావిస్తున్నారు. అదేమిటంటే  రాబోయే ఉపఎన్నికల్లో తాను పోటీ చేసి గెలిచినా, లేదా ఒకవేళ ఓడిపోయినా సరే, తనకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం  కల్పించాలనేది ఆయన ప్రధాన షరతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో సరైన హోదా ,  భవిష్యత్తుపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక హామీ పొందేందుకే ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తూ, పార్టీ అధిష్ఠానానికి ఒక రకమైన చెక్  పెట్టారని ప్రచారం జరుగుతోంది.  కాంగ్రెస్ పార్టీకి కూడా ఖైరతాబాద్ ఉపఎన్నిక అనేది సాధారణమైన పోరు కాదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా సొంత క్యాడర్‌ను, బలమైన ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంటూ వస్తున్న నేత దానం నాగేందర్ మాత్రమే. అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉండాలంటే అది దానం నాగేందర్ అభ్యర్థిత్వంతోనే సాధ్యమవుతుందనే అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఆయన కాకుండా వేరే అభ్యర్థిని నిలబెడితే విజయం అంత తేలిక కాదు.

కాంగ్రెస్‌కు దానం అవసరం

ఈ బలహీనతను లేదా అవసరాన్ని దానం సరిగ్గా క్యాచ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఎంత కీలకమో తెలిసేలా ప్రవర్తిస్తూ, తన షరతులకు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఆయన షరతులకు లొంగకపోతే, ఆయన స్వతంత్రంగానో లేదా వేరే సమీకరణాల వైపో మొగ్గు చూపితే కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకే దానం డిమాండ్లపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ దానం నాగేందర్ షరతులకు పూర్తిగా తలొగ్గుతుందా అన్నది కూడా మరో పెద్ద ప్రశ్న. ఇప్పటికే కేబినెట్‌లో సామాజిక వర్గాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యాల ప్రాతిపదికన తీవ్ర పోటీ ఉంది. ఇప్పుడు దానంకు ముందస్తుగా మంత్రి పదవి హామీ ఇస్తే పార్టీలోని ఇతర సీనియర్ల నుంచి అసంతృప్తి వెల్లువెత్తే ప్రమాదం కూడా ఉంది. కానీ, ఖైరతాబాద్ సీటును ఎలాగైనా గెలుచుకుని ప్రతిపక్షాలకు సవాల్ విసరాలంటే దానంను కాదనలేని పరిస్థితి.

దానంకు బీజేపీ కూడా ఓ ఆప్షన్  

 

 దానం నాగేందర్ పక్కా పొలిటికల్ స్కెచ్ వేశారు.. రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తేనే బి-ఫామ్ అందుకుంటారు అని ఆయన వర్గం భావిస్తోంది.  రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పెద్దలు దానం నాగేందర్‌తో జరిపే సీక్రెట్ చర్చలు, ఇచ్చే హామీలే ఖైరతాబాద్ ఉపఎన్నికల ఫలితాన్ని శాసించబోతున్నాయనడంలో సందేహం లేదు. బలమైన బీసీ నాయకుడి కోసం చూస్తున్న బీజేపీ ఆయనను చేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం ఖాయం. చాయిస్ కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని అనుకోవచ్చు. 

Click here to Read More
Previous Article
Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
Next Article
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment