Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు

1 day ago

మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌-2026 రికర్వ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు.

అమరావతి: మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌ ఫైనల్‌-2026లో భారత్ అద్భుతం చేసింది. తెలుగు తేజం, భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర స్వర్ణాన్ని సాధించారు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా నిలిచి దేశం గర్వించేలా చేశారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ధీరజ్‌ వరల్డ్ కప్ ఫైనల్లో జపాన్‌కు చెందిన నకనిషి జున్యాపై ఉత్కంఠభరిత పోరులో గెలుపొందారు. 5 సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 5-5తో స్కోరు సమం కావడంతో షూట్ ఆఫ్ నిర్వహించారు. విజేతను తేల్చే షూట్‌ఆఫ్‌లో ధీరజ్‌ 10 పాయింట్లు కొట్టగా, ప్రత్యర్థి నకనిషి జున్యా 9 పాయింట్లు నెగ్గడంతో భారత ఆర్చర్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు.

ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఆర్చరీ సాధన మైదానం నుంచి మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ గ్లోబల్ వేదిక వరకు ఎదగడాన్ని హైలైట్ చేశారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ వ్యక్తిగత విభాగంలో రికర్వ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర అని కొనియాడారు. సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ధీరజ్ బొమ్మదేవరకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Click here to Read More
Previous Article
Welcome To AZ VAARTHA
Next Article
YS Jagan AP local polls: ఏపీ స్థానిక పోరులో 34 శాతం బీసీ రిజర్వేషన్ మంటలు - చంద్రబాబు పందెం-జగన్ మైండ్ గేమ్!

Related స్పోర్ట్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment