Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!

1 day ago

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ధోని వాటా కోరినట్లు వచ్చిన నివేదికలను యాజమాన్యం ఖండించగా, అదొక ప్లాంటెడ్ స్టోరీ అంటూ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.

Franchise Denies MS Dhoni Requested Equity Share: ఐపీఎల్ విజయవంతమైన సారథి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీలో భారీ వాటా కోరాడంటూ వెలువడిన నివేదికలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ధోని తొలుత జట్టులో 25 శాతం వాటాను డిమాండ్ చేశాడని, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి తగ్గించుకోగా, యాజమాన్యం 5.5 శాతం ఇచ్చేందుకు ముందుకొచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై సీఎస్కే యాజమాన్యం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది. "ఎంఎస్ ధోని మా వద్ద ఎప్పుడూ వాటాల గురించి ప్రస్తావించలేదు. ఈ అంశంపై మా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్‌తో కూడా ధోని దీని గురించి మాట్లాడినట్లు మా వద్ద ఎలాంటి సమాచారం లేదు" అని సీఎస్కే సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ల‌క్ష‌కుపైగా షేర్లు..
సీఎస్కే షేర్లు ఓపెన్ మార్కెట్లో ట్రేడ్ కావు, ఇవి ప్రైవేట్ ఆఫ్-మార్కెట్ లావాదేవీల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ధోని వద్ద లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీకి సంబంధించి 30 కోట్లకు పైగా షేర్లు పబ్లిక్ చేతిలో ఉండగా, అది మొత్తం షేర్ క్యాపిటల్‌లో దాదాపు 40 శాతంగా ఉందని స‌మాచారం. మాజీ బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ కుటుంబం వద్దే 55 శాతానికి పైగా నియంత్రణ వాటా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీల మార్కెట్ విలువ ప్రకారం ధోని వద్ద ఉన్న షేర్ల విలువ దాదాపు 2.6 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ధోని మొత్తం నికర ఆస్తి విలువ దాదాపు రూ. 1200 కోట్లుగా ఉంది. 
అదంతా అవాస్త‌వం.. 
ఈ ప్రచారంపై భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వ్యాఖ్యానించాడు. ధోని వాటా అడిగాడనే ప్రచారాన్ని అవాస్తవమని, ఇదొక ప్లాంటెడ్ స్టోరీ అని తెలిపాడు. "ఆర్సీబీ విలువ ఇటీవల దాదాపు 1.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అలాంటి స్థాయి ఉన్న ఫ్రాంచైజీయే. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడమే కాకుండా ఇండియా వెలుపల కూడా ఎన్నో జట్లను నడుపుతోంది. సీఎస్కే అనేది ఒక తిరుగులేని బ్రాండ్. దాదాపు 1.8 బిలియన్ల విలువైన ఫ్రాంచైజీలో 25 శాతం వాటా అంటే 400 మిలియన్ డాలర్లు. అంత భారీ మొత్తాన్ని ఎవరూ ఉచితంగా ఎవరికీ ఇవ్వరు. ఒక ఐపీఎల్ టీమ్‌లో ఎవరూ ఊరికే పాతిక శాతం వాటాను రాసివ్వరు" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. సీఎస్కే విజయ ప్రస్థానంలో ధోని పాత్ర మరువలేనిది. తప్పుడు కథనాలు వెలువడినప్పటికీ ఫ్రాంచైజీతో ధోనికి ఉన్న అనుబంధం చెక్కుచెదరలేదని, రాబోయే సీజన్లలోనూ అతడు జట్టుతోనే కొనసాగుతాడని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.



Click here to Read More
Previous Article
Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
Next Article
Homemade Hair Oil : మెంతులు, మందారంతో హెయిర్ ఆయిల్.. జుట్టు సమస్యలు దూరం చేసుకునేందుకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండిలా

Related స్పోర్ట్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment