Fauzi Release Update: జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?

1 hour ago

Fauzi Release On January: డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ 'ఫౌజీ' విడుదల అయ్యే అవకాశాలు లేవని క్లారిటీ వచ్చింది. జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫిల్మ్ నగర్ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi Movie). ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసిన ఓ భారతీయ సైనికుడి కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే?

డిసెంబర్ రేసు నుంచి వాయిదా!
'ఫౌజీ' సినిమాను డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి తొలుత ప్లాన్ చేశారు. అయితే... ఫిల్మ్ నగర్ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే రిలీజ్ అయ్యే ఛాన్సు కనిపించడం లేదు. 'ఫౌజీ' విడుదల వాయిదా పడిందని సమాచారం అందడంతో డిసెంబర్ 4న తమ సినిమాలను విడుదల చేయడానికి నాగ చైతన్య (వృషకర్మ), విశ్వక్ సేన్ (లెగసీ) రెడీ అవుతున్నారు. మరి ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటే కొత్త న్యూస్ వినబడుతోంది.

అసలు ఫౌజీ ఎందుకు వాయిదా పడింది?
'ఫౌజీ'లో విడుదల వాయిదా పడటానికి ప్రధాన కారణం సిజిఐ, గ్రాఫిక్స్ వర్క్స్ అని తెలుస్తోంది. ప్రభాస్ తన షూటింగ్ వర్క్ అంతా నవంబర్ నాటికి పూర్తి చేస్తారని ముందు అనుకున్నప్పటికీ... దర్శకుడు హను రాఘవపూడి అవుట్‌ పుట్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని, అందువల్ల సినిమా పూర్తి అవ్వడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని, అందుకే సినిమా విడుదల వాయిదా వేశారని సమాచారం.

జనవరి 26న విడుదల... సంక్రాంతి టెన్షన్?
డిసెంబర్ నెలలో థియేటర్లలో 'ఫౌజీ' వచ్చే అవకాశం లేదు. దాంతో మరో విడుదల తేదీ కోసం దర్శక నిర్మాతలు చూస్తున్నారు. వచ్చే ఏడాది (2027) రిపబ్లిక్ డే (జనవరి 26న) సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తే బావుంటుందని భావిస్తున్నారట. ఒకవేళ అది నిజమైతే సంక్రాంతి సినిమాలకు టెన్ష తప్పదని చెప్పాలి.

జనవరి 10 నుంచి 15 మధ్యలో నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి. థియేటర్లలోకి ఎక్కువ సినిమాలు వస్తే కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు ఉంటే బడ్జెట్ రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వచ్చిన రెండు మూడు వారాలకు 'ఫౌజీ' లాంటి పెద్ద సినిమా వస్తే... సంక్రాంతి సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తక్కువ. అప్పుడు వాటికి టెన్షన్ తప్పదు. ఒకవేళ 'ఫౌజీ' విడుదల తేదీ మారితే... ఓటీటీ డీల్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మారే అవకాశం ఉంది. మార్చి 2027లో విడుదల కావాల్సిన ప్రభాస్ 'స్పిరిట్' కూడా వాయిదా పడొచ్చు.

Click here to Read More
Previous Article
Suriya Jyothika: సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్
Next Article
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment