Suriya Jyothika: సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్

1 hour ago

Suriya Jyothika Wedding: సెప్టెంబర్ 11 2006న వివాహ బంధంతో సూర్య, జ్యోతిక ఒక్కటి అయ్యారు. పెళ్ళై 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మళ్ళీ పెళ్ళి చేసుకుందీ జంట. ఆ వీడియో వైరల్ అవుతోంది.

భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి? పిల్లల కెరీర్, పెంపకంలో బాధ్యతలు ఎలా పంచుకోవాలి? వంటి విషయాల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో ఇతర ప్రముఖులకు, ప్రేక్షకులకు ఆదర్శంగా నిలుస్తున్న జంటల్లో కోలీవుడ్ స్టార్ సూర్య శివ కుమార్, హీరోయిన్ జ్యోతిక జంట ఒకటి. సెప్టెంబర్ 11 2006న వివాహ బంధంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. వివాహమై 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మళ్ళీ పెళ్ళి చేసుకుందీ జంట.

పిల్లల సాక్షిగా పెళ్ళి... వీడియో వైరల్!
ఆదర్శ దంపతులుగా పేరు పొందిన సూర్య, జ్యోతిక... భార్యాభర్తలుగా తమ 20 ఏళ్ళ వివాహ ప్రయాణాన్ని వేడుకలా జరుపుకొన్నారు. విదేశాల్లోని ఓ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో జ్యోతిక వైట్ కలర్ వెడ్డింగ్ గౌనులో మెరిశారు. సూర్య కూడా వైర్ కలర్ సూట్, బ్లాక్ ట్రౌజర్ ధరించి హ్యాండ్సమ్‌గా కనిపించారు.
సూర్య, జ్యోతికల వివాహ వార్షికోత్సవ వేడుకకు వాళ్ళ పిల్లలు దియా, దేవ్... ఇంకా సూర్య సోదరుడు కార్తీతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారు. ఈ సెలబ్రేషన్స్ వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ది సీక్వెల్... మా 20 ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని వేడుకగా జరుపుకొంటున్నాం'' అని క్యాప్షన్ ఇచ్చారు.

నిస్వార్థమైన ప్రేమకు ప్రతిబింబం
ఈ వేడుక ఓ పరిపూర్ణమైన వివాహానికి సంకేతం కాదని... ఓ జంట అసమానతలు, సర్దుబాట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమను ప్రతిబింబించే వేడుక అని జ్యోతిక పేర్కొన్నారు. అంతే కాకుండా... తనను తన కంటే ఎక్కువగా గౌరవించే వ్యక్తి భర్తగా లభించడం వరమని, సూర్యతో ఉన్న స్నేహాన్ని, బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తానని జ్యోతిక వెల్లడించారు.

సూర్య, జ్యోతిక ప్రయాణం 1999లో వచ్చిన 'పూవెల్లామ్ కేట్టుప్పార్'తో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత 'ఉయిరిలే కలందదు', 'కాక కాక' (తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన 'ఘర్షణ'), 'పేరళగన్', 'మాయావి', 'సిల్లును ఒరు కాదల్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హీరో హీరోయిన్లుగా మొదలైన ప్రయాణం... తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెళ్ళి పీటల వరకు తీసుకు వెళ్ళారు. సెప్టెంబరు 11, 2006న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ మరుసటి ఏడాది (2007లో) కుమార్తె దియా, 2010లో కుమారుడు దేవ్ జన్మించారు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉన్నారు జ్యోతిక. మళ్ళీ '36 వయదినిలే'తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Click here to Read More
Previous Article
Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
Next Article
Fauzi Release Update: జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment