KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

1 hour ago

Telangana Top News |కేసీఆర్ కుటుంబం, సన్నిహితులు ధరణి పోర్టల్ ద్వారా 439.30 ఎకరాల భూములు దోచుకుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సర్వే నంబర్లతో సహా వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన సామాన్య ఉద్యమకారులు తమ ఆస్తులు, సర్వస్వాన్ని కోల్పోతే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములను సంపాదించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం, వారి బంధువుల పేరిట 9 జిల్లాల్లోని 24 మండలాలు, 31 గ్రామాల్లో ఉన్న మొత్తం 439.30 ఎకరాల భూములకు సంబంధించిన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి సర్వే నంబర్లతో సహా సభలో వెల్లడించారు. ధరణి పోర్టల్ ద్వారా వందల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, లేకపోతే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

కేసీఆర్, హరీశ్‌రావు కుటుంబాల భూముల వివరాలు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, మిట్టపల్లి, షివార్ వెంకటా పూర్ ప్రాంతాలలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ పేరిట 67.13 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేటీఆర్ కుటుంబానికి సంబంధించి కేటీఆర్ పేరిట 49.50 ఎకరాలు, భార్య శైలిమ పేరిట 17.30 ఎకరాలు ఉన్నాయి. కేటీఆర్ కుమార్తె అలేఖ్య పేరిట 9.38 ఎకరాలు, కుమారుడు హిమాన్షు రావు పేరిట 46.30 ఎకరాలతో కలిపి మొత్తం 123.19 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. అలాగే కవిత, ఆమె భర్త అనిల్ పేరిట మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 37.26 ఎకరాలు, హరీష్ రావు, ఆయన భార్య పేరిట రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 30.16 ఎకరాల భూములు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చదివి వెల్లడించారు.

జోగినపల్లి, నవీన్ కుమార్ కుటుంబాల ఆస్తులు

కేసీఆర్ బంధువులైన జోగినపల్లి కుటుంబంలో రవీందర్ రావు పేరిట ఎర్రవల్లి వద్ద 53 ఎకరాలు భూములుండగా, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఆయన భార్య రోహిణి పేరిట 25 ఎకరాలు కలిపి మొత్తం 79.20 ఎకరాల భూమి ఉంది. 5 జిల్లాల్లోని 12 గ్రామాల్లో ఈ భూములు విస్తరించి ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కొండల్ రావు కుటుంబం పేరిట మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని 9 గ్రామాల్లో 101.14 ఎకరాల భూమి ఉందన్నారు. ఇలా కేసీఆర్ ఆయన సమీప బంధువుల పేరిట 439.30 ఎకరాల భూములు ఉన్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇదంతా కొల్లగొట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.


KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్, వారి బంధువుల భూముల వివరాలు

కేసీఆర్ కుటుంబం: కేసీఆర్, ఆయన భార్య పేరు మీద సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, మిట్టపల్లి, శివార్ వెంకటాపూర్ ప్రాంతాలలో 67.13 ఎకరాలు

కేటీఆర్ కుటుంబం: కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కుమార్తె అలేఖ్య, కుమారుడు హిమాన్షు రావు పేరు మీద సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లోని ఎర్రవల్లి, జన్వాడ, మర్కూక్, శివార్ వెంకటాపూర్ ప్రాంతాలలో 123.19 ఎకరాలు

కవిత కుటుంబం: కవిత, ఆమె భర్త పేరు మీద మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 8 మండలాలు, 8 గ్రామాల్లో 37.26 ఎకరాలు

హరీష్ రావు కుటుంబం: హరీష్ రావు, ఆయన భార్య పేరు మీద రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని మిట్టపల్లి, నందిపల్లి, రామంచ, అజీజ్‌నగర్ ప్రాంతాలలో 30.16 ఎకరాలు

జోగినపల్లి కుటుంబం: రవీందర్‌రావు, సంతోష్‌కుమార్, సంతోష్‌కుమార్ భార్య రోహిణిల పేరు మీద 5 జిల్లాల్లోని 9 మండలాలు, 12 గ్రామాల్లో 79.20 ఎకరాల భూములు

నవీన్‌కుమార్ - కొండల్‌రావు కుటుంబం: నవీన్‌కుమార్, కొండల్‌రావు పేరు మీద రంగారెడ్డి, , మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని 7 మండలాలు, 9 గ్రామాల్లో 101.14 ఎకరాల భూములు ఉన్నాయి

 

మొత్తంగా చూస్తే 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి 439.30 ఎకరాల విస్తీర్ణంలో భూమి కేసీఆర్, వారి బంధువుల పేరిట ఉన్నాయని సీఎం రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. 

Click here to Read More
Previous Article
Pregnancy and High BP : ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట
Next Article
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment