Pregnancy and High BP : ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట

1 hour ago

High Blood Pressure in Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల చాలామందికి మధుమేహం, బీపీ వంటి సమస్యలు వస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

High Blood Pressure During Pregnancy : గర్భధారణ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో కొందరికి రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సయమంలో హై బీపీని నిర్లక్ష్యం చేస్తే తల్లితో పాటు శిశువుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే వైద్యులు సూచించిన చికిత్సతో పాటు.. పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ముఖ్యంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉండే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

అరటిపండ్లు, నారింజ వంటి పండ్లు

అరటిపండ్లు, నారింజ వంటి పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇవి శరీరంలో సోడియం, ద్రవాల సమతుల్యతను నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే గర్భధారణ సమయంలో వైద్యుల సూచనలకు అనుగుణంగా బ్యాలెన్స్ డైట్లో భాగంగా తీసుకోవచ్చు. 

ఆకుకూరలు

పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పలు పోషకాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో అవసరమైన పోషకాలను అందించడంలో ఇవి సహాయపడతాయి. ఆకుకూరలను బాగా శుభ్రం చేసి, మంచిగా ఉడికించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 

ఓట్స్, బ్రౌన్ రైస్

ఓట్స్, బ్రౌన్ రైస్, ఇతర సంపూర్ణ ధాన్యాల్లో ఫైబర్ ఉంటుంది. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. తెల్ల బియ్యం లేదా శుద్ధి చేసిన ధాన్యాల స్థానంలో కొంత భాగాన్ని సంపూర్ణ ధాన్యాలతో భర్తీ చేస్తే మంచిది. 

పాలు, పెరుగు

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కాల్షియంకు మంచి వనరులు. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి కాల్షియం అవసరం. చక్కెర ఎక్కువగా కలిపిన ఫ్లేవర్డ్ డెయిరీ ఉత్పత్తుల కంటే సాధారణ పాలు లేదా పెరుగును ఎంచుకోవచ్చు.

నట్స్, సీడ్స్

బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు వంటి నట్స్, విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఉప్పు కలపని నట్స్‌ను చిన్న మోతాదులో తీసుకోవచ్చు. అయితే ఇవి కూడా కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలే కాబట్టి లిమిటెడ్గా తినవచ్చు. 

పప్పులు, గుడ్లు 

పప్పులు, శనగలు, పెసలు, గుడ్లు వంటి వాటిలో ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో తల్లి శరీర అవసరాలకు, శిశువు ఎదుగుదలకు తగిన పోషకాహారం అవసరం. అందుకే ప్రతి భోజనంలో తగిన ప్రోటీన్ ఉండేలా చూసుకోవచ్చు.

ఉప్పును తగ్గించండి

హై బీపీ ఉన్నప్పుడు ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించడం ముఖ్యం. ప్యాకేజ్డ్ స్నాక్స్, చిప్స్, పచ్చళ్లు, పాపడ్స్, ఇన్‌స్టంట్ ఫుడ్స్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉండొచ్చు. వీటిని పరిమితం చేయడం మంచిది.

గుర్తించుకోవాల్సిన టిప్స్

గర్భధారణ సమయంలో బీపీ పెరిగితే ఆహారంతోనే దాన్ని కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించకూడదు. ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం, ముఖం లేదా చేతులు అకస్మాత్తుగా వాపు రావడం, పై పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇప్పటికే బీపీ మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా లేకుండా మందులను ఆపకూడదు.

 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Click here to Read More
Previous Article
Anant Nag : నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెష్
Next Article
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

Related లైఫ్‌స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment