Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!

1 hour ago

Khairatabad Bada Ganesh immersion: ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనాలు ముగిశాయి. శుక్రవారం ఉదయం శోభాయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేసేలా జీహెచ్‌ఎంసీ, పోలీసుల ఏర్పాట్లు చేశారు.

Hyderabad Ganesh nimajjanam updates 2026:  హైదరాబాద్ నగరవాసులతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి..  69 అడుగుల పంచముఖ సంకటహర గణపతి సాధారణ భక్తుల దర్శనాలు ముగిశాయి. నిమజ్జన ఏర్పాట్ల కోసం ఉత్సవ కమిటీ, అధికారులు బడా గణేశుడి వద్ద సాధారణ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. మంటపం చుట్టూ ఉన్న షెడ్డు, బ్యారికేడ్లను తొలగించి, విగ్రహాన్ని శోభాయాత్రకు తరలించేందుకు వీలుగా వెల్డింగ్ , లారీ టస్కర్‌పైకిపైకి ఎక్కించే పనులను వేగవంతం చేశారు.

ఈ ఏడాది 50 టన్నులకు పైగా బరువున్న బడా గణేశుడి విగ్రహాన్ని భద్రంగా తరలించేందుకు ఏపీ నుంచి ప్రత్యేక భారీ  టస్కర్‌  వాహనాన్ని ఖైరతాబాద్‌కి రప్పించారు. విగ్రహం కదలికకు అనుకూలంగా విద్యుత్ లైన్లు, కేబుల్స్, చెట్ల కొమ్మలను తొలగిస్తూ రూట్‌ను జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖల అధికారులు క్లియర్ చేశారు. నిమజ్జన వాహనానికి అమర్చిన భారీ చట్రాన్ని బిగించే పనులు, విగ్రహ భద్రతా తనిఖీలను సాంకేతిక బృందాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి.

శుక్రవారం సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల ప్రాంతంలోనే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను ప్రారంభించేలా అధికారులు క్లియర్ షెడ్యూల్ రూపొందించారు. మంటపం నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా హుస్సేన్‌సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అడ్డంకులు లేకుండా అత్యంత వేగంగా ప్రక్రియ ముగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల లోపే ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనాన్ని హుస్సేన్‌సాగర్‌లో విజయవంతంగా పూర్తి చేయడమే టార్గెట్‌గా ఉత్సవ కమిటీ, జిహెచ్ఎంసి పెట్టుకున్నాయి. దీనికోసం హుస్సేన్‌సాగర్ నంబర్-6 క్రేన్ వద్ద ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేసిన ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి ఉంచారు. బడా గణేష్ నిమజ్జనం ముందస్తుగా పూర్తయితే మిగతా వేలాది గణపతి విగ్రహాల నిమజ్జనాలు సజావుగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు.

నగరం మొత్తం ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకునేలా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. శోభాయాత్ర మార్గాల్లో సుమారు 20,000 మంది పోలీసుల మోహరింపుతో పాటు, 10 వేల సిసిటీవీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగుతోంది. నిమజ్జన మార్గాల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు, ట్రాఫిక్ మళ్లింపులను అమల్లోకి తెచ్చి భక్తులకు, నగరవాసులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు.
 
 హుస్సేన్‌సాగర్ జలాల్లో  నగరం నలుమూలల నుంచి వచ్చే వేలాది గల్లీ గణపతులతో పాటు, బాలాపూర్, ఖైరతాబాద్‌ వంటి దిగ్గజ విగ్రహాలు సహా సుమారు  25,000 కంటే ఎక్కువ మీడియం, భారీ విగ్రహాలు  హుస్సేన్‌సాగర్‌లోని ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్,  పీపుల్స్ ప్లాజా వైపు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ల వద్దకు చేరుకోనున్నాయి. ఇక సాగర్ ఒడ్డున నెలకొనే ఆధ్యాత్మిక సందడి మాటల్లో చెప్పలేనిది. ఒకవైపు గణపతి బప్పా మోరియా అంటూ వేలాది మంది భక్తుల గొంతుకల జయజయధ్వానాలు, మరోవైపు తీన్మార్ డప్పుల సప్పుడు, రంగురంగుల గులాబీ పొడుల చల్లుళ్ళు, భారీ రథాల డిజైన్లు, విద్యుత్ దీపాల వెలుగులతో ట్యాంక్ బండ్ పరిసరాలు ఒక మహా ఉత్సవ రంగాన్ని తలపిస్తాయి. రాత్రంతా రంగుల వెలుగుల్లో కొనసాగే ఈ శోభాయాత్ర, నగర సంస్కృతికి మచ్చుతునకగా నిలుస్తూ హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలన్నింటినీ అత్యంత కోలాహలంగా మార్చేస్తుంది.

Click here to Read More
Previous Article
Paradise KCR Role: కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ యాక్టర్ దొరికేశాడు
Next Article
Title Sponsorship Deal: టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment