Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్

1 hour ago

Tamil Nadu granite baron: తమిళనాడు ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వీరమణిపై పోక్సో కేసు నమోదు అయింది. నిరుపేద బాలికలపై రెండు దశాబ్దాలుగా లైంగిక దౌర్జన్యాలు చేసినట్లు విచారణలో తేలింది.

Veeramani granite king sexual abuse case: తమిళనాడులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి,  గ్రానైట్ కింగ్ గా పేరొందిన వీరమణిపై నమోదైన పోక్సో  కేసు  నమోదు అయింది.  నిరుపేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలపై ఈయన దశాబ్దాలుగా సాగిస్తున్న క్రూరమైన లైంగిక దౌర్జన్యాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో విచారణ వేగవంతం కావడంతో, మరికొంతమంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

వీరమణి వ్యవస్థీకృతంగా, ఒక పథకం ప్రకారం నిరుపేద , బలహీన వర్గాలకు చెందిన చిన్నారి బాలికలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ తరహా లైంగిక వేధింపులు, దౌర్జన్యాలు కేవలం కొన్ని ఏళ్లుగా కాకుండా, ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్నాయని పోలీసులు  గుర్తించారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, డబ్బు, అధికారం చూపించి బాలికల జీవితాలను బుగ్గిపాలు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
  
వీరమణిపై తొలుత ఒక మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డపై వీరమణి లైంగిక దాడికి పాల్పడ్డాడని వారు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తు క్రమంలో వీరమణి నేపథ్యం, ఆయన కార్యకలాపాలపై లోతుగా విచారించగా, ఇది కేవలం ఒక్క బాలికకు సంబంధించిన సమస్య కాదని, పెద్ద ఎత్తున జరుగుతున్న దౌర్జన్యమని తేలింది.
 
తమిళనాడులోని గ్రానైట్ పరిశ్రమలో వీరమణి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. దశాబ్దాలుగా గ్రానైట్ క్వారీలు, వ్యాపారాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. రాజకీయంగా కూడా గట్టి పట్టున్న ఈయన, డబ్బు, అధికార బలంతో తన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వలయాన్నే ఆసరాగా చేసుకుని, పేద బాలికలపై సాగిస్తున్న అకృత్యాలు ఎక్కడా బయటకు రాకుండా తొక్కిపెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల విచారణ వేగవంతం కావడంతో, వీరమణి నుండి వేధింపులు ఎదుర్కొన్న మరికొంతమంది బాధితులు ధైర్యం తెచ్చుకుని ముందుకు వస్తున్నారు.  రెండు దశాబ్దాలుగా ఈ దారుణం సాగుతోందని అనుమానిస్తున్నాం. ఇప్పటి వరకు కొంతమంది బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశాం. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని దర్యాప్తు అధికారి  ప్రకటించారు.  వీరమణికి సహకరించిన వారు, దౌర్జన్యాలను దాచిపెట్టడానికి ప్రయత్నించిన వారిని కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ప్రణాళికలు రూపొందించారు.   
ఈ కేసు తమిళనాడులో రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి రెండు దశాబ్దాలుగా ఇంతటి దారుణాలకు పాల్పడుతుంటే, నిఘా వ్యవస్థలు, మునుపటి ప్రభుత్వాలు ఏం చేశాయని   మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


Click here to Read More
Previous Article
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Next Article
Pumpkin Seeds Benefits : 30 రోజులు గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. బరువు తగ్గుతారా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment