Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్

1 hour ago

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డికి, సోమల రఘురామ్ రెడ్డితో వివాహం నిశ్చయమైంది. YSR ఆశీస్సులతో ఈ శుభకార్యం జరుగుతోందని షర్మిల సోషల్ మీడియా వేదికగా వెల్లడించి సంతోషం వ్యక్తం చేశారు.

YS Sharmila Daughter Wedding | కడప: వైఎస్ షర్మిల ఇంట్లో మరో వివాహ వేడుక జరగనుంది. కుమార్తె వివాహ వేడుకకు సంబంధించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన అభిమానులకు శుభవార్త అందించారు.  నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ మహోత్సవం జరగనుంది. YSR కుటుంబంలో ఇది మరో సంతోషకరమైన క్షణమన్నారు. ఇరువురి కలయిక దైవ సంకల్పంగా, నూరేళ్ల జీవితానికి శుభారంభంగా నిలవనుంది. దేవుడి ఆశీర్వాదంతో నాన్న వైఎస్సార్ ఘాట్ వేదికగా ఈ శుభవార్తను మీతో పంచుకోవడం నాకు అత్యంత ఆనందదాయకంగా ఉందన్నారు.

ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, నిరంతరం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో, రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న YSR ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిల తెలిపారు. నాన్న వైఎస్సార్ దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండగా నిలుస్తాయని, ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు.

Click here to Read More
Previous Article
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment