Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు

1 hour ago

Land For Poor People: పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది. శనివారం విశాఖలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Land For Poor People: పేద ప్రజల సొంతింటి కల నెరవేరబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న వేలాది పేద కుటుంబాలకు వాటిపై పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. శనివారం విశాఖలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. 11 మండలాల పరిధిలోని రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు.  ఈ మేరకు ఎక్స్‌ లో సీఎం చంద్రబాబు పోస్ట్‌ చేశారు. కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదని, 28 వేల కుటుంబాలకు వారి ఇళ్లపై  పూర్తి హక్కులు కల్పించే చరిత్రాత్మక కార్యక్రమం అన్నారు. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుందన్నారు. వారి భవిష్యత్తుకు ఓ భద్రత కలుగుతుందన్నారు. బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుందన్నారు. సొంతిల్లుతో ఆత్మగౌరవం, భరోసా దక్కుతుందని చెప్పారు. 

దశాబ్దాల నిరీక్షణకు తెర

"దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది. తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం. ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు. 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది. భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.  బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది. ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి" అని సీఎం చంద్రబాబు పోస్ట్ పెట్టారు. 

Click here to Read More
Previous Article
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Next Article
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment