Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే

1 hour ago

YSRCP Politics | శ్రీకాకుళం జిల్లా వైసీపీలో తీవ్ర అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు కూడా రాదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ (Chiranjeevi Nag) చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని, కావాలంటే పార్టీ సర్వే నివేదికలను పరిశీలించుకోవచ్చని సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వైఖరితో పార్టీకి ఏ ప్రయోజనం లేదన్నారు.

జిల్లా నాయకత్వంపై తీవ్ర విమర్శలు

ఆమదాలవలసలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడిన చిరంజీవి నాగ్.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ వైఖరి సరిగ్గా లేదని విమర్శించారు. పార్టీకి పెద్దదిక్కుగా చెప్పుకొనే ధర్మాన ప్రసాదరావు తీవ్ర అభద్రతాభావంతో రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా పరిశీలకుడు బూడి ముత్యాలనాయుడి బాధ్యతలపై ప్రశ్నిస్తూ, స్థానిక ఎన్నికల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వేదికపై ఉన్న సీనియర్ నాయకులు ఎవరూ ఖండించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. 

తమ కుటుంబంపై వ్యాఖ్యల్ని ఖండించలేదని మండిపాటు

సెప్టెంబర్ 12న త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించింది.  
చింతాడ రవి అరెస్టును రాజకీయ పరిణామంగా అభివర్ణించి, తమ్మినేని సీతారాం అరెస్టు కాకపోవడానికి బంధుత్వాలే కారణమని గొర్లె కిరణ్ మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. జిల్లా పరిశీలకుడు బూడి ముత్యాలనాయుడు, పార్లమెంట్ పార్టీ పరిశీలకులు అయిన కుంబ రవి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావులు గొర్లె కిరణ్ కుమార్ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

 

పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడంలో ధర్మాన కృష్ణదాస్ విఫలమయ్యారని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను అడ్డుకోలేకపోయారని విమర్శించారు. కేవలం ఒక కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ఆ విషయాన్ని నేరుగా పార్టీ అధిష్ఠానానికి స్పష్టం చేయాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటూ గెలవదని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

Click here to Read More
Previous Article
Telangana Assembly Clash: అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
Next Article
Power House: క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment