NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

1 hour ago

Andhra Pradesh Pensions | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువును మరో 2 రోజులు పొడిగించింది. అర్హులందరికీ అవకాశం ఇవ్వడానికే ఈ నిర్ణయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

NTR Bharosa Pensions | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువును పెంచుతూ శుభవార్త అందించింది. అర్హులైనవారు ఈ నెల 18వ తేదీ వరకు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మరో రెండు రోజులు సమయం పెంచినట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ఉన్న పింఛన్లకు దరఖాస్తు గడువును ఇప్పుడు సెప్టెంబర్ 18 వరకు విస్తరించారు.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. స్థానిక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల వద్ద దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు రసీదు (అకనాలెడ్జ్‌మెంట్) పత్రాన్ని అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సుమారు 62 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అయితే ఏదైనా కేటగిరీలో అర్హత ఉండి ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు ఈ పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు సహా ఇతర అర్హులైన చేతివృత్తుల వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

ప్రధాన అర్హతలు

ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000, పట్టణాల్లో రూ. 12,000 మించరాదు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే భూమి ఉండాలి.

ఇతర నిబంధనలు: కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు లేదా ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు ఉండరాదు.

దరఖాస్తులు, పరిశీలన విధానం

అభ్యర్థులు స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయంలో అప్లికేషన్ ఫారం సమర్పించాలి. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సిబ్బంది eKYC పూర్తి చేస్తారు. ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అర్హతలను పరిశీలించిన తర్వాత, సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ఈ జాబితాను పరిశీలించి ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తారు. క్షేత్రస్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా రాష్ట్రస్థాయిలో పరిశీలన జరిపి, బడ్జెట్ కేటాయింపును బట్టి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు ఆమోదం తెలుపుతుంది.

Click here to Read More
Previous Article
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Next Article
Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment