Danam Nagender Khairatabad bypoll: ఖైరతాబాద్ ఉపఎన్ని ఖాయమే - సుప్రీంలో ఊరట కష్టమే - కాంగ్రెస్‌కే ఎడ్జ్ ఉందా?

54 minutes ago

Danam Nagender: ఖైరతాబాద్ ఉపఎన్నిక తప్పదన్నసంకేతాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లనని దానం చెప్పినా.. పిటిషన్ వేశారు. కానీ ఊరట లభించడం కష్టమన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వ్యక్తమవుతోంది.

Khairatabad Assembly byelection:  తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు దానం నాగేందర్. అయితే ఆయన మొదట సుప్రీంకోర్టుకు వెళ్లనని  ఖైరతాబాద్ ఉపఎన్నికను నేరుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ ఓ చాయిస్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవడం ఆయన పిటిషన్ వేశారు కానీ..సుప్రీంకోర్టులో ఊరట లభించడం కష్టమేనన్న అభిప్రాయంబలంగా ఉంది.   చట్టపరంగా అనర్హత వేటు పడినప్పటికీ, తదుపరి జరిగే ఉపఎన్నికలో పోటీ చేయకుండా నిరోధించే నిబంధన ఏదీ లేదు కాబట్టి దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఈ పరిణామంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం కాగా, ఇక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా దానం నాగేందర్ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఖైరతాబాద్‌లో దానంకే పట్టు

ఖైరతాబాద్ నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే.. పార్టీల సిద్ధాంతాల కంటే దానం నాగేందర్ వ్యక్తిగత ప్రభావమే ఇక్కడ ఎక్కువ పనిచేస్తుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏవైనా సరే.. నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, డివిజన్‌ స్థాయి నేతలతో ఆయనకు దశాబ్దాలుగా ఉన్న ప్రత్యక్ష పరిచయాలు, బలమైన అనుచరగణమే ఆయన ప్రధాన బలం. ఖైరతాబాద్‌లో ప్రత్యేకంగా ఏ ప్రతిపక్ష పార్టీకీ బలమైన సంస్థాగత క్యాడర్ నిర్మాణం లేకపోవడంతో, దానం నెట్‌వర్కే ప్రధాన శక్తిగా నిలుస్తోంది. ఇక పార్టీల సమీకరణాల పరంగా చూస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్‌తో సంప్రదాయబద్ధంగా పాత ఓటుబ్యాంకు ఉంది. దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగినప్పుడు.. ఆయన వ్యక్తిగత ఇమేజ్, బస్తీల్లో ఉన్న పట్టుకు తోడు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటుబ్యాంకు, శ్రేణులు ఏకమవుతాయి. దీనికి తోడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల హోదా తోడవటం దానం నాగేందర్‌కు ఉపఎన్నికలో భారీ అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉందనేది పొలిటికల్ ట్రెండ్స్ చెబుతున్నాయి.

బలమైన అభ్యర్థే బీఆర్ఎస్‌కు పెద్ద సవాలు    

ఈ పరిస్థితి ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. ఖైరతాబాద్‌లో స్థానికంగా దానం స్థాయి బలమైన, నియోజకవర్గమంతా తెలిసి ఉన్న ప్రత్యామ్నాయ నాయకుడు బీఆర్ఎస్‌కు లేకపోవడం పెద్ద లోటు. గతంలో దానంను నమ్ముకునే అక్కడ బీఆర్ఎస్ రాజకీయం నడిచింది. ఇప్పుడు ఆయననే ఎదుర్కొని నిలబడటానికి బలమైన లోకల్ క్యాడర్, సమర్థుడైన అభ్యర్థి దొరకడం గులాబీ పార్టీకి కత్తిమీద సాము లాంటిదే. ప్రభుత్వ బలం, దానం పర్సనల్ క్యాడర్‌ను తట్టుకుని పోరాడటం బీఆర్ఎస్‌కు అంత తేలికైన విషయం కాదు.

టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు గెలిచిన బీజేపీ

మరోవైపు భారతీయ జనతా పార్టీ  పరిస్థితి కూడా ఇక్కడ ఏమంత ఆశాజనకంగా లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ తో పొత్తు ఉన్న సమయంలో మాత్రమే బీజేపీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించగలిగింది. ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి డిపాజిట్ కోల్పోవడం లేదా నామమాత్రపు ఓట్లకే పరిమితమవ్వడం జరిగింది. నగర పరిధిలో ఉనికి ఉన్నప్పటికీ, ఖైరతాబాద్‌లోని స్థానిక బస్తీ ఓటర్లను ఆకట్టుకునే స్థాయి బలమైన కేడర్ గానీ, అభ్యర్థి గానీ బీజేపీకి కూడా పెద్దగా అందుబాటులో లేరు.   ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైన వేళ, మిగిలిన ప్రతిపక్ష పార్టీల వద్ద గట్టి అభ్యర్థులు, బలమైన క్యాడర్ లేకపోవడం దానం నాగేందర్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతోంది. చట్టపరమైన తీర్పు దానంకు ప్రతికూలంగా వచ్చినా, ప్రజాక్షేత్రంలో మాత్రం అధికార పార్టీ బలం, తన సొంత ఇమేజ్, స్థానిక బస్తీ ఓటర్ల మద్దతుతో ఆయన మరోసారి విజయం సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

STORIES YOU MAY LIKE

Click here to Read More
Previous Article
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
Next Article
మహాకవి గురజాడ అప్పారావు గారు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment