Homemade Hair Oil : మెంతులు, మందారంతో హెయిర్ ఆయిల్.. జుట్టు సమస్యలు దూరం చేసుకునేందుకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండిలా

1 day ago

Methi, Hibiscus and Kalonji Hair Oil : జుట్టు సంరక్షణలో భాగంగా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మెంతులు, మందారం, కలోంజి సీడ్స్తో ఈ ఆయిల్ ట్రై చేయండి.

Homemade Hair Oil for Hair Care : జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు, జుట్టు సంరక్షణ విధానం వంటి ఎన్నో అంశాలు హెయిర్ ఫాల్‌పై ప్రభావం చూపుతాయి. మీరు కూడా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. హెయిర్ కేర్‌లో రొటీన్లో మెంతులు, మందారం, కొబ్బరి నూనె, కలొంజీ సీడ్స్​తో హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. 

జుట్టు సంరక్షణలో భాగంగా ఈ ఆయిల్ ఉపయోగిస్తే మీరు మంచి ఫలితాలు చూడవచ్చు. మరి ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఈ నూనె ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

కొబ్బరి నూనె - 1 కప్పు

మెంతులు - 1 టేబుల్ స్పూన్

కలొంజీ - 1 టేబుల్ స్పూన్

తాజా మందార పూలు - 3

హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారీ విధానం

ముందుగా మందార పూలను తీసుకుని కాడలను తొలగించాలి. అనంతరం వాటిని శుభ్రంగా నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. మందార పూల రేకులను విడదీసి.. వాటిని తడిలేకుండా తుడిచి పక్కన పెట్టుకోండి. మెంతులు, కలొంజీని కూడా సిద్ధం చేసుకోండి. వీటిని మిక్సీలో వేసి పిండిగా కాకుండా గరుకుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటి సహజ నూనెలు బయటకు వస్తాయి. 

ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని దానిలో కప్పు కొబ్బరి నూనె వేసి తక్కువ మంటపై వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత దంచిన మెంతులు, కలొంజీ వేసుకోవాలి. ఆ తర్వాత మందార రేకులను కూడా వేసి కొన్ని నిమిషాలు తక్కువ మంటపై వేడి చేయాలి. ఈ పదార్థాలు మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. నూనె పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి.

నూనె పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన జల్లెడ లేదా మస్లిన్ క్లాత్‌తో నూనెను వడకట్టాలి. అందులోని మెంతులు, కలొంజీ, మందార పూలను పూర్తిగా తొలగించాలి. తర్వాత నూనెను శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని సీసాలోకి తీసుకోవాలి. నేరుగా సూర్యరశ్మి పడని, తేమ లేని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. 

ఇలా తయారు చేసుకున్న నూనెలో కొద్దిగా తీసుకుని చేతివేళ్లతో తలపై సున్నితంగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దకుండా నెమ్మదిగా మసాజ్ చేయడం మంచిది. నూనెను సుమారు 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచుకుని.. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయవచ్చు. 

 

 

Click here to Read More
Previous Article
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
Next Article
Potatoes and Onions : ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి ఉంచకూడదట.. పాడవకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Related లైఫ్‌స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment