Puri Jagannadh: పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?

1 hour ago

Chaitanya Reddy On Puri Jagannadh: 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ టైంలో జరిగిన ఫైనాన్షియల్ డీల్స్ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీలపై లేడీ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

పూరి జగన్నాథ్ (Puri Jagannadh)ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటారు. ఓ దర్శకుడిగా మాత్రమే కాదు... నిర్మాతగానూ ఆయన డేరింగ్ స్టెప్స్ ఎన్నో వేశారు. తన సినిమాలతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చి పెట్టారు. అటువంటి డైరెక్టర్ కొన్ని రోజులుగా సక్సెస్ ట్రాక్ తప్పారు. ఆయన డైరెక్షన్ చేసిన ఫిలిమ్స్ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. డిజాస్టర్ టాక్ అందుకున్న సినిమాల్లో 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart) ఒకటి. ఛార్మీతో కలిసి ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. ఆ సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూరి - ఛార్మీలపై లేడీ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

అప్పుడు చావు తప్ప వేరే దారి లేదన్నారు...
ఇప్పుడు ఫోన్ బ్లాక్ చేశారు, నంబర్ మార్చేశారు
'డబుల్ ఇస్మార్ట్'ను 'హనుమాన్' ప్రొడ్యూస్ చేసిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి రిలీజ్ చేశారు. ఆ సినిమా విడుదలకు ముందు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ అమౌంట్ ఇచ్చి తీసుకుని రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గత్యంతరం లేక తమ దగ్గరకు వచ్చారని చైతన్య రెడ్డి తెలిపారు.

'డబుల్ ఇస్మార్ట్' డిస్ట్రిబ్యూషన్ వల్ల తమకు 40 కోట్ల రూపాయల వరకు లాస్ వచ్చిందని చైతన్య రెడ్డి వివరించారు. 'లైగర్' నష్టాలను, పాత బకాయిలను 'డబుల్ ఇస్మార్ట్' విడుదలకు ముందు క్లియర్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితుల్లో పలు ప్రాంతాల్లో మార్నింగ్ షోలు ఆగిపోయానని ఆమె పేర్కొన్నారు. అప్పుడు సినిమా విడుదల ఆగితే చావు తప్ప తమకు వేరే దారి లేదని పూరి, ఛార్మీ వేడుకుంటే చెక్ మీద సంతకం చేశానని, అగ్రిమెంట్ ఛేంజ్ చేయాలని చెబితే మాట ఇస్తున్నామని నమ్మబలికారని ఆవిడ పేర్కొన్నారు.

'డబుల్ ఇస్మార్ట్' విడుదలకు ముందు పూరి, ఛార్మి తమను వేడుకున్నారని చైతన్య రెడ్డి పేర్కొన్నారు. తమను ఆదుకోకపోతే కెరీర్లు, జీవితాలు నాశనం అవుతాయని ఛార్మి ప్రాధేయపడ్డారని, సినిమా గనుక బాక్సాఫీస్ బరిలో వసూళ్ళు రాబట్టడంలో ఫెయిల్ అయితే భవిష్యత్తులో సినిమా చేసి ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని పూరి - ఛార్మీ హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. చిత్రసీమలో పలువురు వద్దని చెప్పినా వాళ్ళ మాటలు నమ్మి అండగా నిలబడ్డామన్నారు చైతన్య రెడ్డి. 

బాక్సాఫీస్ బరిలో 'డబుల్ ఇస్మార్ట్' డిజాస్టర్‌ కావడంతో ఛార్మి తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారని, పూరి జగన్నాథ్ తన మొబైల్ నంబర్‌ను మార్చేసి అందుబాటులో లేకుండా పోయారని చైతన్య రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత పూరి, ఛార్మీలను తన భర్త నిరంజన్ రెడ్డి ముంబైలో కలవగా... తమ నష్టాలు భర్తీ చేయడం మాట పక్కన పెట్టి తమతో సినిమా చేయడానికి ఛార్మికి 15 కోట్ల రెమ్యూనరేషన్, లాభాల్లో 50 శాతం లాభాల్లో వాటా డిమాండ్ చేశారని చైతన్య రెడ్డి వెల్లడించారు. పూరి - ఛార్మీల పరువు పోయేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి వాళ్ళిద్దరూ స్పందిస్తారో? లేదో?

Click here to Read More
Previous Article
Desk Job Health Risks : డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
Next Article
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment