Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్

1 hour ago

హైదరాబాద్ - విజయవాడ నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేసి, పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు సీప్లేన్ జల ప్రయాణ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

Seaplane Services between Hussain Sagar to Prakasam Barrage | హైదరాబాద్: పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్ - విజయవాడ నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు జల ప్రయాణం (సీప్లేన్) సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని ఈ నగరాల నడుమ రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ నీళ్లపై ఎగిరి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో సీప్లేన్‌‌లో దిగితే ఆ మజానే వేరు. ఈ సీప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు కీలక దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ ప్రతిపాదనలు ఒకే అయితే కనుక 2 తెలుగు రాష్ట్రాల మధ్య పర్యాటక అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పర్యాటక విధానంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పౌర విమానయాన శాఖతో గత జులైలో నిర్వహించిన సమావేశంలో ఈ సీప్లేన్ సేవల అంశంపై చర్చలు జరిపారు. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్య సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ఈ సీ ప్లేన్ పథకం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు భారత విమానాశ్రయాల సంస్థ (AAI) ప్రతినిధుల బృందం ఇటీవల హుస్సేన్‌సాగర్‌ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రాష్ట్ర పర్యాటక శాఖ, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) అధికారులతో కలిసి ఈ టీమ్ నీటిపై సీప్లేన్ దిగేందుకు, టేకాఫ్ అయ్యేందుకు అవకాశాలను పరిశీలించింది. నీటి ఉపరితలంపై విమానం ప్రయాణించే ట్యాక్సీ పాత్‌తో పాటు ప్రయాణికుల రాకపోకల కోసం జెట్టి, టెర్మినల్ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఏఏఐ బృందం పరిశీలించింది. 

వివిధ సాంకేతిక అంశాలను విశ్లేషించిన అనంతరం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు తదుపరి కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే తెలుగు రాష్ట్రాల్లో రవాణా రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే కనుక రోడ్డు, రైలు, ఆకాశమార్గాలతో పాటు జల మార్గం కూడా హైదరాబాద్ - విజయవాడ నగరాల మధ్య అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. 

Click here to Read More
Previous Article
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment