KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?

1 hour ago

KCR Farmhouse Dispute: ఎర్రవల్లిలో 45 ఎకరాల ప్రభుత్వ భూమి గల్లంతుపై రేవంత్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు ఇచ్చి రీ-సర్వే చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది.

Revanth Reddy Probe KCR Land:   సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ఫామ్‌హౌస్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు మరోసారి  వేడెక్కనున్నాయి.  ఫామ్‌హౌస్ సరిహద్దుల పరిధిలో లెక్కల్లో లేని దాదాపు 45 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి కలిసిపోయిందనే అంశంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 325 పరిధిలో మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, రెవెన్యూ అధికారులు నిర్వహించిన ప్రాథమిక సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే క్షేత్రస్థాయిలో తేలడం తీవ్ర వివాదానికి మూలమైంది.

అదృశ్యమైన ఆ 45 ఎకరాల అసైన్డ్ భూమి ఎటుపోయింది?                

కేసీఆర్ ఫామ్‌హౌస్ హద్దుల లోపలకే ఈ భూమి చేరిందా? అన్న కోణంలో సవివరంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎర్రవల్లి,  వెంకటాపురం గ్రామాల సరిహద్దుల పరిధిలో పూర్తిస్థాయి రీ-సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ తేడాని నిగ్గుతేల్చేందుకు నేరుగా కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ యంత్రాంగం జారీ చేయనున్న నోటీసుల ప్రకారం కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ అధీనంలో ఉన్న భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు, పాత రికార్డులు ,  సేల్ డీడ్లతో స్వయంగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ రీ-సర్వేలో 45 ఎకరాల ప్రభుత్వ లేదా అసైన్డ్ భూమి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలోనే ఉంటే, దానిని వెంటనే స్వాధీనం చేసుకుని పేద రైతులకు పంచడం ,  తెలంగాణ అమరుల కాలనీకి కేటాయించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ధరణి పోర్టల్ అవకతవకలు బయటపడతాయా?               

ఈ భూమి వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తుఫాను సృష్టిస్తోంది. బిఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల్లో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ నిరంతరం ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా మాజీ సీఎం ఫామ్‌హౌస్ ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల లెక్కింపులోనే ఈ స్థాయిలో వ్యత్యాసాలు వెలుగుచూడటంతో కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అటు బిఆర్ఎస్ వర్గాలు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకమైన  మిస్సింగ్ భూముల  ప్రచారాన్ని తెరపైకి తెస్తోందని మండిపడుతున్నాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములన్నీ చట్టబద్ధంగా కొనుగోలు చేసినవేనని, రికార్డులు పక్కాగా ఉన్నాయని పార్టీ నేతలు వాదిస్తున్నారు.

భూపోరాటం తప్పదా? 

 

 పొలం సరిహద్దులు, రికార్డుల్లో ఉన్న సాంకేతిక లోపాలను చూపుతూ రాజకీయంగా బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బిఆర్ఎస్ విమర్శిస్తోంది. రాబోయే రోజుల్లో రెవెన్యూ అధికారులు అధికారికంగా నోటీసులు ఇచ్చి, రీ-సర్వేను క్షేత్రస్థాయిలో ప్రారంభించినట్లయితే ఎర్రవల్లి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.  ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఈ భూపోరాటం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.              

Click here to Read More
Previous Article
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
Next Article
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment