టాటా నుంచి మరో కొత్త సెడాన్‌.. Tigor ప్లేస్‌లోకి Aeris.. ఇవే హైలైట్స్‌!

1 hour ago

టాటా ఏరిస్ సెడాన్‌ సెప్టెంబర్‌ 25న మనకు పరిచయం కానుంది. టిగోర్‌ స్థానంలో రానున్న ఈ కారులో కొత్త డిజైన్‌, ఆధునిక ఫీచర్లు & పెట్రోల్‌, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ ఎంపికలు ఉండనున్నాయి.

Tata Tigor facelift as Tata Aeris: టాటా మోటార్స్‌ నుంచి కొత్త సెడాన్‌ మార్కెట్‌లోకి రాబోతోంది. టిగోర్‌ ఫేస్‌లిఫ్ట్‌కు కొత్త పేరుతో 'ఏరిస్‌'గా ‍‌(Tata Aeris) తీసుకురానుంది. ఈ కొత్త సెడాన్‌ను సెప్టెంబర్‌ 25న అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇప్పటికే టాటా మోటార్స్‌ ఏరిస్‌కు సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేసింది. దీంతో ఈ కారుపై అంచనాలు పెరిగాయి.

ఏరిస్‌ డిజైన్‌ 

టిగోర్‌తో పోలిస్తే ఏరిస్‌ డిజైన్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముందు భాగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇందులో సన్నని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ ఉన్నాయి. వాటి పైన పలుచని డీఆర్‌ఎల్‌ స్ట్రిప్‌ ఉంటుంది. టిగోర్‌లో లేని ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంప్స్‌ను కూడా ఏరిస్‌లో అందించనున్నట్లు టీజర్‌ ద్వారా తెలుస్తోంది.

కారు వెనుక భాగంలోనూ మార్పులు ఉంటాయి. కొత్త డిజైన్‌ టెయిల్‌ ల్యాంప్స్‌ కనిపిస్తున్నాయి. వెనుక బంపర్‌ డిజైన్‌ కూడా మారనుంది. ఇరువైపులా రిఫ్లెక్టర్లు ఉండే అవకాశం ఉంది. కారు వెనుక భాగంలో టిగోర్‌ తరహా నాచ్‌బ్యాక్‌ రూపాన్ని కొనసాగించనున్నారు.

ఏరిస్‌లో కొత్త అల్లాయ్‌ వీల్స్‌ కూడా వస్తాయి. వీటి పరిమాణం 15 అంగుళాలు ఉండొచ్చని తెలుస్తోంది. డోర్లకు సంప్రదాయ పుల్‌ టైప్‌ హ్యాండిల్స్‌ ఉంటాయి. టీజర్‌లో కొత్త ఊదా రంగు బాడీ షేడ్‌ కూడా కనిపించింది. ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ అయినప్పటికీ కారు బాడీలో కొన్ని మార్పులు చేయనున్నారు.

ఏరిస్‌ ఇంటీరియర్‌

ఏరిస్‌ లోపలి భాగంలోనూ మార్పులు ఉండనున్నాయి. ఇటీవల అప్‌డేట్‌ అయిన టియాగో నుంచి కొన్ని డిజైన్‌ అంశాలను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో కొత్త డ్యాష్‌బోర్డ్‌, ప్రత్యేకంగా కనిపించే టచ్‌స్క్రీన్‌ వంటి మార్పులు ఉండొచ్చని సమాచారం.

ఫీచర్ల విషయానికి వస్తే ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, పవర్‌ అడ్జస్టబుల్‌ ఓఆర్‌వీఎంలు, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, వెనుక ఏసీ వెంట్స్‌ వంటి సదుపాయాలు ఉండే అవకాశం ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్స్‌ కూడా అందించవచ్చని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రూ. 2.92 లక్షల RE హిమాలయన్ 440ని కేవలం రూ.30,000 కే ఇంటికి తెచ్చుకోండి! తక్కువ వడ్డీతో EMI లెక్కలు

ఏరిస్‌ ఇంజిన్‌ 

ఇక ఇంజిన్‌ విషయానికి వస్తే టిగోర్‌లో ఉన్న 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను ఏరిస్‌లో కొనసాగించే అవకాశం ఉంది. పెట్రోల్‌-సీఎన్‌జీ ఎంపిక కూడా ఉంటుంది. రెండు పవర్‌ట్రెయిన్‌లకు 5-స్పీడ్‌ మాన్యువల్‌ & 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ ఎంపికలు ఉండనున్నాయి.

ఏరిస్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ కూడా రానుంది. టియాగో ఈవీ నుంచి బ్యాటరీ ఎంపికలను తీసుకునే అవకాశం ఉంది. 19.2 కిలోవాట్‌అవర్‌ & 24 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీ ప్యాక్‌లతో ఈవీని అందించవచ్చని అంచనా.

ఏరిస్‌ ధరలు 

ప్రస్తుతం టిగోర్‌ ధర రూ.5.55 లక్షల నుంచి రూ.8.84 లక్షల వరకు ఉంది. టిగోర్‌ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. ఏరిస్‌ ధరలు కూడా స్వల్ప మార్పులతో దాదాపుగా ఇలాగే ఉండే అవకాశం ఉంది.

 

టియాగో ఈవీ తరహాలో ఏరిస్‌ ఈవీలో 'బ్యాటరీ యాజ్‌ ఎ సబ్‌స్క్రిప్షన్‌' (BaaS) విధానం కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. దీనివల్ల ప్రారంభ ధరను తగ్గించే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 25న ఏరిస్‌ అధికారిక ఆవిష్కరణ తర్వాత డిజైన్‌, ఫీచర్లు, ధర & ఇతర వివరాలపై పూర్తి స్పష్టత రానుంది.

 
STORIES
Click here to Read More
Previous Article
Fridge Food Storage Guide : ఫ్రిడ్జ్‌లో పాలు, కూరగాయలు, మాంసం ఎక్కడ పెట్టాలి? ఏ అరలో ఏది పెట్టాలో తెలుసా?
Next Article
సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి అభయం

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment