Anant Nag : నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెష్

1 hour ago

Anant Nag Dadasaheb Phalke : ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ పురస్కారం అందించనుంది.

Actor Anant Nag To Be Honoured With Dadasaheb Phalke Award : ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను... సినీ రంగంలో అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2024 సంవత్సరానికి ఆయనకు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు అనంత్ నాగ్ అందించిన సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు కేంద్రం తెలిపింది.

రాష్ట్రపతి చేతుల మీదుగా...

గుజరాత్‌లోని కేవడియాలో ఈ నెల 22న జరగనున్న 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో అనంత్ నాగ్‌కు... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారం అందజేయనున్నారు. కన్నడతో పాటు పలు భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు అనంత్ నాగ్. ఆయనకు అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల కన్నడ ఇండస్ట్రీతో పాటు సినీ అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రధాని మోదీ విషెష్

 

నటుడు అనంత్ నాగ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో సత్కరించబడిన ప్రఖ్యాత నటుడు అనంత్ నాగ్ గారికి అభినందనలు. గత కొన్ని దశాబ్దాలుగా, ఆయన సహజ నటన, అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ, అసాధారణమైన కళా నైపుణ్యం భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశాయి. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ సాటిలేని నటనను, జీవాన్ని నింపారు. ఒక గొప్ప కళాకారుడికి ఇది నిజంగా దక్కిన అర్హమైన గౌరవం.' అంటూ పోస్ట్ చేశారు.

5 దశాబ్దాల సినీ ప్రయాణం

దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో అనంత్ నాగ్... కన్నడతో పాటు తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. థియేటర్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన... 1973లో కన్నడ మూవీ 'సంకల్ప'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మంథన్, కొండుర, కల్‌యుగ్ తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఆర్కే నారాయణన్ కథల ఆధారంగా తెరకెక్కించిన ఫేమస్ టీవీ సీరియల్ 'మాల్గుడి డేస్'లో అనంత్ నాగ్ మిఠాయి వాలా పాత్రతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాగే, రాజ కుమార, గాలిపట 2, కేజీఎఫ్, కన్నేశ్వర రామ వంటి మూవీస్ మరింత పేరు తీసుకొచ్చాయి. తెలుగులో భీష్మ, బాలు, అనుగ్రహం, శంఖారావం వంటి చిత్రాల్లో నటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2025లో 'పద్మ భూషణ్'తో గౌరవించింది. ఇప్పుడు అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందించనుంది.

Click here to Read More
Previous Article
CM Vijay Son Jason Sanjay : మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్
Next Article
Pregnancy and High BP : ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment