ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకుంటే వెలువడే వేడి.. తొడలు, పొట్ట దిగువ భాగంలోని చర్మంపై ప్రభావం చూపొచ్చు. ఎక్కువసేపు వేడి తగలడం వల్ల చర్మంపై మచ్చలు లేదా రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు.

23 hours ago

AP Mega DSC Recruitment | మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (AP Mega DSC) ద్వారా ఉపాధ్యాయ నియామకాలలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏడు దశల్లో నిర్వహించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అందులో తీవ్ర అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి పరీక్షలు రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) ఉద్యోగాలు కేటాయించడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీచర్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థుల జీవితాలు అంటే మీకు నవ్వులాట అయిందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని, స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టినట్లు చెబుతున్నా, అసలు ఈవెంట్లలో విజేతల జాబితాలో మెగా డీఎస్సీ జాబ్ కొట్టిన వారి పేర్లు ఎందుకు లేవో చెప్పాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

కేస్ స్టడీ 1 – విజేతల జాబితాలోనే లేని పేర్లు
విశాఖపట్నంలో యోగేశ్వరరావు అనే అభ్యర్థికి, అలాగే ఆయన చెల్లికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎస్జీటీ టీచర్ పోస్టులు ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. 2009లో నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ వరుసగా తొలి, రెండో స్థానాలు సాధించినట్లు సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారు. అయితే, తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ విడుదల చేసిన విజేతల అధికారిక జాబితాలో వీరి పేర్లు లేవని తేలిందని జగన్ స్పష్టం చేశారు. 

కేస్ స్టడీ 2 – నకిలీ సర్టిఫికేట్ల నిర్లక్ష్యం

మరో కేసులో బసవేశ్వరరావు అనే అభ్యర్థి గుడివాడలో జరిగిన 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు నకిలీ సర్టిఫికేట్ సమర్పించి ఉద్యోగం పొందారని వైఎస్ జగన్ తెలిపారు. ఈ సర్టిఫికేట్ నకిలీదని ఖో-ఖో అసోసియేషన్ స్వయంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కు నియామకాల కంటే ముందే (11-07-2025న) అధికారిక లేఖ ద్వారా తెరిపించినప్పటికీ, ఆ లేఖను పక్కన పడేసి ఉద్యోగం ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.

కేస్ స్టడీ 3 – జరగని క్రీడా పోటీల పేరుతో ఉద్యోగాలు

 

ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థికి 2003లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నట్లు ఉన్న సర్టిఫికేట్ ఆధారంగా ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇచ్చారని జగన్ తెలిపారు. అయితే నాగార్జున యూనివర్సిటీలో ఆల్ ఇండియా పోటీలు అసలు జరగలేదని, అక్కడ కేవలం సౌత్ వెస్ట్ జోన్ పోటీలు మాత్రమే జరిగాయని తేలినట్లు పేర్కొన్నారు. 7 ఫేజ్ వెరిఫికేషన్ పూర్తయినా ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం మెగా డిఎస్సీ స్కామ్‌ను స్పష్టం చేస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు.

Click here to Read More
Previous Article
Laptop on the Lap : ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల అమ్మాయిల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయా?
Next Article
Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment