Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!

    1 hour ago

    ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పట్లో కాని పనిలే అంటూ లైట్ తీసుకున్న ప్రతిపక్షాలకు, తాజాగా ఎఫ్‌సీడీఎ నిర్మాణం , అధునాత సౌకర్యాలు, భవిష్యత్ వ్యూహాలు చూస్తుంటే లైట్ తీసుకోవద్దు మిత్రమా అంటున్నారట.

    Bharat Future City Hyderabad:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీలో నిర్మాణం, అభివృద్ది ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దేశంలోనే అరుదైన గుర్తింపును సొంత చేసుకుంది ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్‌ అథారటీ బిల్డింగ్ (FCDA). పర్యావరణానికి ఏ మాత్రం హని కలిగించకుండా నిర్మించిన, అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసినందుకు గ్రీన్ బిల్డిండ్ ట్యాంగ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సిటీకి సచివాలయాన్ని కూడా తరలించే ప్రక్రియ జరుగుతోందని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఛాంబర్స్ రెడీ అయ్యాయని అంటున్నారు. 

    భారత్ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతోంది..?

    హైదరాబాద్ మహానగరం తన పరిధి విస్తరించడంతోపాటు, జీహెచ్‌ఎంసీని విభజించడంతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఎలా ఉన్నా, ఫ్యూచర్ సిటీ అభివృద్దిపైనే కోటి ఆశలు పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఏకంగా 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. భవిష్యత్‌లో 25 లక్షల నుంచి 30లక్షల జనాభా భారత్ ఫ్యూచర్ సిటీలో నివసించేలా మౌలిక సదుపాయాలు, అధునాతన వసతులు, విద్యా, ఉపాధి అవకాశాలు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ అంటే ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ అనేంతలా కనీవినీ ఎరుగని రీతిలో వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

    దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన FCDA బిల్డింగ్ ప్రత్యేకతలివే..

    ఫ్యూచర్ సిటి అభివృద్దిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన తొలి అడుగే రికార్డ్ బద్దలు కొట్టింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ది, నిర్మాణ పనులు పర్యావేక్షణ, పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పర్యవేక్షించేందుకు ఫ్యూచర్ సిటిలో నిర్మించిన తొలి భారీ నిర్మాణం ఫ్యూచర్ సిటి డెవలప్‌మెంట్ అథారిటీ బిల్డింగ్. ఈ నిర్మాణంలో ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించే పదార్దాలు వినియోగించలేదు. పర్యావరణహిత నిర్మాణ ప్రమాణాలు పాటించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత తాజాగా గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు పొందింది దేశం దృష్టిని ఆకర్షించింది. వర్షపు నీటి సంరక్షణకు ఇక్కడ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, 15కిలోవాట్ల సౌరశక్తి సామర్ద్యంతో విత్ ప్లాంట్‌ను నిర్మాణం, ఫ్యూచర్ సిటీ విద్యుత్ అవసరాలకు కొంత భాగం సౌరశక్తిని వినియోగించేలా ప్రణాళికలు రూపొందించడం ఇలా ఒకటేమిటి ఫ్యూచర్ సిటీలో అన్నీ వినూత్న ప్రయోగాలే. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 

    విదేశీ ప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. FCDA పరిసరాల్లో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను వినియోగించేందుకు బయోడైజర్టర్ ప్లాంట్ ఏర్పాటు ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. బయోగ్యాస్‌తో పాటు సేంద్రియ ఎరువులను తయారు చేయడంతో, ఫ్యూచర్ సిటీ నూతన భవనం వ్యర్థాల నిర్వహణలో పర్యావరణహిత భవనంగా నిలిచింది. అందుకే ఫ్యూచర్ సిటికీ కేరాఫ్‌గా నిలిచే FCDA బిల్డింగ్ కాలుష్యరహిత నిర్మాణంగా నెట్ జీరో బిల్డింగ్ గా పేరు తెచ్చుకుంది.

     

    Click here to Read More
    Previous Article
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
    Next Article
    FIFA World Cup 2026 Prize Money: ఫీఫా 2026 ప్రైజ్ మనీ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! టీ20 వరల్డ్ కప్ కంటే 60 రెట్లు ఎక్కువ!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment