Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BP and Diabetes Food Restrictions : బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే ఏమి తినాలి? ఏవి మానాలి? డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఇవే

    1 hour ago

    Diet Plan to Control Sugar and BP : మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ డైట్​ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

    Diet Tips for Diabetes and High BP Patients : ఈ రోజుల్లో మధుమేహం, బీపీ సమస్యలు చాలా సాధారణంగా మారిపోయాయి. అయితే ఈ రెండు సమస్యలను కంట్రోల్‌లో చేయడంలో లైఫ్​స్టైల్​తో పాటు.. ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఫుడ్స్ తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ, కొలెస్ట్రాల్‌, బరువు వంటి అంశాలను నియంత్రించుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్‌, కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని అంటున్నారు. 

    బీపీ, షుగర్ ఉన్నవారు కొన్ని ఆహారాలు తగ్గించాలని.. కొన్ని ఫుడ్స్ కచ్చితంగా డైట్​లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. శేషి కిరణ్ ఈ అంశంపై పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవడం తగ్గించాలో.. ఎలాంటివి ఎక్కువగా తీసుకోవాలో పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    రిఫైన్డ్ కార్బ్స్ 

    బీపీ, షుగర్ ఉన్నవారు.. వైట్ రైస్, వైట్ బ్రెడ్‌, షుగర్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్‌, ప్రాసెస్డ్ స్నాక్స్ వంటి వాటిని తీసుకోవద్దని చెప్తున్నారు డాక్టర్ శేషి కిరణ్. ఎందుకంటే వీటిలో రిఫైన్డ్ కార్బ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి. కాబట్టి వీటికి బదులుగా ఓట్స్‌, బ్రౌన్ రైస్‌, మిల్లెట్స్‌, గోధుమలు, క్వినోవా వంటి అధిక ఫైబర్ ఆహారాలను తినడం మంచిదని సూచిస్తున్నారు. 

    ఓట్స్ తినాలనుకుంటే..  

    ఇన్‌స్టంట్ ఓట్స్ కంటే స్టీల్ కట్ లేదా రోల్డ్ ఓట్స్ ఆరోగ్యానికి మెరుగైనవి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో షుగర్ నెమ్మదిగా పెరుగుతుంది. అయితే ఓట్స్‌లో అదనంగా చక్కెర, సిరప్స్‌, స్వీట్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం మంచిది సూచించారు.
    అలాగే ఓట్స్ లేదా ఇతర బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్స్ తీసుకునేప్పుడు చియా సీడ్స్‌, నట్స్‌, సీడ్స్, గ్రీక్ యోగర్ట్‌, తాజా పండ్లు వంటివి కలిపి తీసుకుంటే మంచిదని అంటున్నారు. ఇలా తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అంతేకాకుండా గ్లూకోజ్ శోషణ నెమ్మదిగా జరుగుతుంది.

    అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌

    ప్యాకెట్ స్నాక్స్‌, ఫ్రైడ్ ఫుడ్స్‌, ప్రాసెస్డ్ మీట్‌, బేకరీ ఐటమ్స్‌, కోల్డ్ డ్రింక్స్‌, ఫాస్ట్ ఫుడ్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు.. బీపీ, షుగర్ రెండింటినీ పెంచే ప్రమాదం ఉంది. అలాగే ఇవి కొలెస్ట్రాల్ కూడా రెట్టింపు చేస్తాయి. వీటిలో ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్‌, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌, అదనపు చక్కెర ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేసి పరిస్థితిని ఇంకా దిగజార్చుతాయి. 

    ఉప్పు, స్వీట్స్​తో జాగ్రత్త

    ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ డ్రింక్స్‌, ప్రాసెస్డ్ కార్బ్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే ఈ రెండింటినీ తగ్గించడం చాలా అవసరమని చెప్తున్నారు డాక్టర్ శేషి కిరణ్. 

    ఈ డైట్స్ మంచివి.. ఎందుకంటే..

    పండ్లు, కూరగాయలు, పప్పులు, లీన్ ప్రోటీన్స్‌, నట్స్‌, సీడ్స్‌, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే మెడిటరేనియన్ లేదా DASH డైట్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి బీపీ, షుగర్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయని వైద్యులు చెప్తున్నారు.

    ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి?

    యాపిల్స్‌, పియర్స్‌, బెర్రీస్‌, ఆరెంజ్‌, పీచెస్‌, ప్లమ్స్ వంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు పరిమిత మోతాదులో తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి మంచివి. పైగా రక్తంలో చక్కెరను వేగంగా పెంచకుండా చేస్తాయి.

    లైఫ్​స్టైల్లో మార్పులు..

    బీపీ, షుగర్ లేదా ఏ ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కంట్రోల్ చేయాలన్నా.. కేవలం ఫుడ్ మారిస్తే సరిపోదు. లైఫ్​స్టైల్లో మార్పులు కూడా చేయాలి. రెగ్యులర్​గా  వ్యాయామం, తగినంత నీరు తాగడం, మంచి నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. అలాగే వైద్యులు సూచించే డయాబెటిస్‌, బీపీ మందులు కూడా ఉపయోగించాలని.. అప్పుడే మంచి ఫలితాలు చూడగలరని నిపుణులు చెప్తున్నారు. 

    Click here to Read More
    Previous Article
    Virat Kohli Surpasses MS Dhoni , Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment