Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    10th Class Students టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

    2 months ago

    Special Focus on 10th Class Students గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి.. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆదేశించారు. బుధవారం భామినిలో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

      10th Class Students  టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
    గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సూచనలిస్తున్న ఇన్‌చార్జి పీవో

     

    భామిని, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి.. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆదేశించారు. బుధవారం భామినిలో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. సబ్జెక్టులపై సందేహాలను నివృత్ది చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. క్రమం తప్పకుండా చదివి ఎక్కడ మార్కులు సాధించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పి.శివకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi on Amit Shah: ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్
    Next Article
    Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

    Related ఎడ్యుకేషన్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment