Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    High Tension in Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!

    2 hours ago

    కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ‘వెన్నుపోటు’ నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదంటూ పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

    Kethireddy Pedda Reddy News | తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైలైట్‌గా నిలిచే ప్రాంతాల్లో తాడిపత్రి ఒకటి. నేడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో చేపట్టిన ‘వెన్నుపోటు’ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నిలిపివేశారు. ఈ నిరసనకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో, పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఉద్రిక్తతల మధ్య పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది. 

    పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికక్కడే రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత చేయి దాటింది. దీంతో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసు వాహనంలో అనంతపురానికి తరలించారు. పెద్దారెడ్డి అరెస్ట్‌తో తాడిపత్రిలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణవ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

    జేసీ వర్గీయుల బైక్ ర్యాలీ..

    మరోవైపు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు జరిగాయి. ఒకే రోజు అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు వైఎస్సార్‌సీపీ నిరసనను అడ్డుకున్నారు.

    తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ.. 

    ఓవైపు తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ భారీ ఎత్తున జరగనుంది. 20 ఎకరాల్లో జర్మన్ షెడ్లతో, 30 వేల మంది కూర్చునేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్, NDA నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. రెండేళ్ల పాలనా ప్రగతిపై ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ నిరసనల్లో పాల్గొంటున్నారు. 

     

    కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా, డీఎస్సీ పోస్టుల పేరుతో అక్రమాలకు పాల్పడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రెండేళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసినా , కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. జగన్ చేతిలో పరశురాముడి గొడ్డలి ఉందని, 2029 ఎన్నికల్లో కూటమి అవినీతిని నరకబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Click here to Read More
    Previous Article
    సైన్స్ vs ఆధ్యాత్మికత : మంచోళ్లు త్వరగా చనిపోవడం వెనుక అసలు రహస్యం!
    Next Article
    Drink Too Much Tea : టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment