NTR : ఆ రోజు నా వెనుక ఎవరూ లేరు - నా కన్నీరు తుడిచింది వాడే... ఎన్టీఆర్ ఎమోషనల్ రియాక్షన్

2 hours ago

NTR Reaction : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. తన ఫస్ట్ మూవీ రిలీజ్ టైం రోజులను గుర్తు చేసుకున్నారు.

NTR Speech In Fahad Faasil Dont Trouble The Troulbe Movie Pre Release Event : తన ఫస్ట్ మూవీ 'నిన్ను చూడాలని' ప్రారంభానికి తన కుటుంబం నుంచి ఎవరూ రాలేదని... అప్పుడు చాలా బాధపడినట్లు చెప్పారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన... తన ఫస్ట్ డే సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు.

దేవుడు విన్నాడేమో
తన ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని మూవీ ఓపెనింగ్‌కు ఒక్కడినే వెళ్లానని... అప్పుడు ఎవరూ లేరని అన్నారు ఎన్టీఆర్. 'ఓపెనింగ్‌కు అమ్మ రానని అంది. నా కాళ్ల మీద నిలబడాలి అని నాన్న కూడా రాలేదు. ఒక్కడినే వెళ్లినందుకు చాలా బాధ పడ్డాను. కుటుంబ సభ్యులు ఎవరూ లేరని ఆ దేవుడు విన్నాడేమో... మీరందరినీ (FANS) ఇచ్చాడు. సరిపోలేదు అనుకున్నాడేమో... నాకు దేవుడిచ్చిన ఫ్యామిలీ... కీరవాణి కుటుంబం. 25 ఏళ్ల స్టూడెంట్ నెం.1 యూనివర్సరీని ఈ సినిమా వేదికపై జరుపుకొంటున్నాం.' అని చెప్పారు.

'నా కన్నీళ్లు తుడిచింది'

తన కన్నీళ్లు తుడిచింది కార్తికేయ అని చెప్పారు ఎన్టీఆర్. 'నేను స్టూడెంట్ నెం.1 స్టార్ట్ చేసినప్పుడు నా వయస్సు 17. కార్తికేయ వయస్సు 9. ఒక ఫేజ్‌లో నా సినిమాలు సరిగ్గా ఆడలేదు. అలాంటి టైంలో కార్తికేయ నా పక్కన నిలబడ్డాడు. RRR జరిగిందంటే కార్తికేయ వల్లే. బాహుబలి వెనుక కూడా కార్తికేయ ఉన్నాడు. నా మొహంలో చిరునవ్వు వచ్చిన ప్రతీసారీ వీడున్నాడు. నా కన్నీరు తుడిచిన వాడు వీడే.' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

డ్రాగన్ అప్డేట్

అనుకున్న టైంకే డ్రాగన్ వస్తుందని... త్వరలోనే దీని అప్డేట్స్‌తో కలుద్దామని చెప్పారు ఎన్టీఆర్. 'నా చేతికి సర్జరీ అయినప్పటి నుంచీ జోష్ రావడం లేదు. కాస్త మీ అందరినీ చూశాక జోష్ వచ్చింది. త్వరలోనే డ్రాగన్ షూటింగ్‌లో జాయిన్ అవుతాను. ఎలాంటి డిలే లేదు. అనుకున్న టైంకే డ్రాగన్ వస్తుంది.' అని అన్నారు.

బాలయ్య డైలాగ్‌తో...

అలాగే, ఈవెంట్‌లో ఫహాద్ ఫాజిల్‌తో ఫన్ చేశారు ఎన్టీఆర్. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అంటూ బాలయ్య డైలాగ్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. అంతా కాకుండా ఫహాద్ ఫాజిల్‌తో తొడ కొట్టించి మరీ డైలాగ్ చెప్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సూపర్ ట్రెండ్ అవుతోంది. అటు, బాలయ్య ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పదే పదే షేర్ చేస్తున్నారు. బాబాయ్, అబ్బాయ్‌లది ప్రత్యేక అనుబంధం. బాలయ్య తారక్ కోసం మాట్లాడినా... తారక్ బాలయ్య కోసం మాట్లాడినా హైప్ మామూలుగా ఉండదు.

 

రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ కామెడీ మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా... ఫహాద్‌తో పాటు బేబీ సారా, సౌరభ్ సచ్ దేవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 2న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

Click here to Read More
Previous Article
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Next Article
Desk Job Health Risks : డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment