Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Trump Threatens Oman:ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!

    2 hours ago

    Trump Threatens Oman:హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం ప్రయత్నిస్తే తుడిచిపెట్టేస్తామని ఒమన్‌కు ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్‌తో జరగాల్సిన ఒప్పందంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 

    Trump Threatens Oman:ప్రపంచ రాజకీయ చదరంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈసారి ఒమన్‌ను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధిపై పట్టుకోసం ఏ దేశమైనా ప్రయత్నిస్తే వారిని ఉఫ్ అని ఊదేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

    వాళ్లు మాకు బాకీ పడ్డారు: ట్రంప్

    ఈ వివాదం కేవలం సముద్ర జలాలకే పరిమితం కాలేదు. పశ్చిమాసియాలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరాలంటే గల్ఫ్ దేశాలు కచ్చితంగా అబ్రహం ఒప్పందాన్ని చేర్సాల్సిందేనంటూ కండిషన్ పెట్టారు. వారు మాకు బాకీ పడి ఉన్నారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానంలో రాబోయే పెను మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. 

    హోర్ముజ్ జలసంధి ఒక దేశానికే చెందింది కాదు: ట్రంప్

    మే 28న జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్, ఒమన్ కలిసి ఉమ్మడిగా నియంత్రించే ప్రతిపాదన వ్యవస్థ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన అత్యంత కఠినంగా స్పందించారు. హోర్ముజ్ అనేది అంతర్జాతీయ జలక్షేత్రం. దీనిని ఎవరూ తమ గుప్పిట్లో ఉంచుకోలేరు. ఒమన్ కూడా మిగిలిన దేశాల్లానే ప్రవర్తించాలి. లేదంటే మేం వారిని తుడిచిపెట్టేయాల్సి వస్తుంది అని నేరుగా హెచ్చరించారు. 

    తెరపైకి అబ్రహం ఒప్పందం

    మరోవైపు ఇరాన్ వ్యవహారంలో ట్రంప్ ఒక వ్యూహాత్మక లింక్ పెట్టారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే అబ్రహం ఒప్పందాలపై సంతకం చేస్తేనే ఇరాన్‌తో ఏదైనా డీల్ కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు. 

    మూడు కారణాలతో.. 

    దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి ప్రపంచంలోని మొత్తం చమురు వాణిజ్యంలో సుమారు 20-30 శాతం హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతోంది. దీనిపై ఇరాన్ లేదా ఇతర దేశాల పట్టు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా చేతుల్లో ఉండదు. తన మొదటి పదవీ కాలంలో ఇజ్రాయెల్‌- అరబ్ దేశాల మధ్య కుదిర్చిన అబ్రహం ఒప్పందాలను ట్రంప్ తన గొప్ప విజయంగా భావిస్తారు. ఇప్పుడు దీనిని పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలకు కూడా విస్తరించడం ద్వారా ఇరాన్‌ను ఒంటరి చేయాలనేది ఆయన ప్లాన్. ఇరాన్‌పై ఒత్తిడి, సైనిక ఒత్తిడిని పెంచడం ద్వారా తమ అణ్వాయుధ కార్యక్రమాలను విడిచిపెట్టేలా చూడటమే అంతిమ లక్ష్యం. 

    ప్రపంచ కూటమి ఏర్పాటుకు...

    ట్రంప్ తన ప్రత్యేక దూతలు స్టీవ్ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌లను ఇప్పటికే రంగంలోకి దించారు. రాబోయే కొద్ది నెలల్లో గల్ఫ్‌ దేశాలపై ఈ ఒప్పందాల కోసం తీవ్రమైన ఒత్తిడి రానుంది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 2025 నాటికి ఈ ప్రాంతంలో కొత్త పన్ను విధానాలు, రక్షణ ఒప్పందాలు అమల్లోకి రానున్న వేళ ఈ లోపే ప్రపంచ కూటమి ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. 

    ఏం జరుగుతుందో ఏమో?

    హోర్ముజ్ జలసంధిలో స్వల్ప ఉద్రిక్తత తలతెత్తినా పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరగడం చూస్తూనే ఉన్నాం. సౌదీ అరేబియా ఇప్పటికే పాలస్తనా దేశం ఏర్పడితే ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం చేసుకుంటామని చెబుతోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇప్పుడు ట్రంప్‌ హెచ్చరికలతో ఈ దేశాలు తమ నిర్ణయాలను మార్చుకుంటాయా లేదా అమెరికాపై ఎదురుతిరుగుతాయా అనేది ఆసక్తిగా మారింది. తుడిచిపెట్టేస్తాం అంటూ చేసిన హెచ్చరిక బెదిరింపులేనా లేదా నిజంగానే సైనిక చర్యల ఉంటుందా అనే భయాందోళన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. 

    Click here to Read More
    Previous Article
    Chandrayaan-2 Discovery Ice on Moon:చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!
    Next Article
    Hardik Pandya News: హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment