Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Fake Paneer: హైదరాబాద్‌లో ఫేక్ పనీర్‌ కలకలం.. తనిఖీల్లో 825 కేజీల చీజ్ అనలాగ్ స్వాధీనం- మీ ఆరోగ్యం జాగ్రత్త

    5 hours ago

    Fake Paneer In Hyderabad | హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో పనీర్ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్న 825 కిలోల నకిలీ చీజ్ అనలాగ్ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    హైదరాబాద్: మీకు పనీర్ (Paneer) అంటే ఇష్టమా? పనీర్‌తో చేసిన వంటకాలు ఇష్టంగా లాగించేస్తున్నారా.. అయితే అది నిజమైనా పనీర్ కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఫేక్ పనీర్‌ను భారీగా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో పనీర్ పేరుతో జరుగుతున్న నకిలీ ఆహార ఉత్పత్తుల విక్రయాలపై హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అసలైన పాల పదార్థాలకు బదులుగా కూరగాయల నూనెలు, ఇతర కొవ్వులతో తయారు చేసిన చీజ్ అనలాగ్ (Cheese Analogue) ఉత్పత్తులను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులు, కంపెనీల ఆటకట్టించారు. మార్కెట్లో వీటికి పనీర్, మిల్క్ పనీర్, మలై పనీర్ వంటి లేబుల్స్ అంటించి అసలైన పనీర్ అని విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

    హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్ ఫాస్ట్) నగరంలోని సుమారు 45 రిటైల్, హోల్‌సేల్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో  దాదాపు 825 కిలోల నాసిరకం, కల్తీ పనీర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందాలు జరిపిన విచారణలో ఈ నకిలీ చీజ్ అనలాగ్ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుండి నగర అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తేలింది. లో ఫ్యాట్ పనీర్, మీడియం ఫ్యాట్ పనీర్, ఫ్రెష్ పనీర్ అనే పేర్లతో విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల తయారీదారు వివరాలు, ప్యాకింగ్, ఎక్స్‌పైరీ డేట్, బ్యాచ్ నంబర్ లాంటి ప్రాథమిక వివరాలు లేకుండానే నకిలీ పనీర్ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

    హోల్‌సేల్ వ్యాపారులు, తయారీదారులు తమ ప్యాకెట్లపై చీజ్ అనలాగ్, నో డైరీ ఫ్యాట్ అని స్పష్టంగా ముద్రించినా, రిటైల్ వ్యాపారులు మాత్రం అధిక లాభాల ఆశతో వాటిని పనీర్‌ అని చెప్పి విక్రయిస్తున్నారు. వినియోగదారులు లేదా హోటల్ నిర్వాహకులు అసలైన పనీర్ కావాలని ఆర్డర్ చేసినప్పుడు, వారికి ఈ చీజ్ అనలాగ్‌ సరఫరా చేస్తున్నారు. ప్యాకెట్లపై ఉండే హెచ్చరికలను దాచిపెట్టి, ప్యాకెట్లు, ప్యాకేజింగ్ లేకుండా విడిగా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు.

    ఈ దాడుల్లో ఎటువంటి చట్టబద్ధమైన FSSAI (భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ) లైసెన్సులు లేకుండానే పలువురు వ్యాపారులు అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. వీరు భారీ మొత్తంలో చీజ్ అనలాగ్‌ను కొనుగోలు చేసి, ప్రీమియం పనీర్, లో ఫ్యాట్ పనీర్, ఫ్రెష్ పనీర్ అని లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ నిర్ధారించింది.

    పనీర్ తయారీలో ప్రమాదకర పద్ధతులు
    సోదాల సందర్భంగా నకిలీ పనీర్ తయారీలో వాడుతున్న ప్రమాదకరమైన పద్ధతులు వెలుగుచూశాయి. పనీర్ బరువు, పరిమాణం పెంచడానికి ఇందులో స్టార్చ్ కలపడం, అధిక మోతాదులో నీటిని చేర్చడం, పాలు కాకుండా ఇతర కొవ్వులు, సింథటిక్ పాలను ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నారు. మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకర రసాయనాలను సైతం వాడుతున్నారని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేయడం, లేబెలింగ్ రూల్స్ ఉల్లంఘించడం వంటి తీవ్ర లోపాలను గుర్తించారు.

    అనారోగ్య సమస్యలు తప్పవు..
    ఫేక్ పనీర్‌ వంటి కల్తీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలెర్జీలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పనీర్‌ను టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్ట్స్ రాగానే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Click here to Read More
    Previous Article
    Warning Signs of Heart Attack : ఉదయాన్నే కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. గుండెపోటు హెచ్చరికలు కావచ్చు
    Next Article
    US Iran Peace Deal: హర్మూజ్‌లో నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా, నౌకలకు లైన్ క్లియర్- అయినా ట్రంప్ ట్విస్ట్ !

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment