Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే

    5 hours ago

    Collector Prabhakar Reddy: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థలకే పంపుతున్న తరుణంలో.. కలెక్టర్ తన పిల్లలను ప్రభుత్వ స్కూల్‌కు పంపుతున్నారు.

    Collector Prabhakar Reddy son joins government school:  లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించి పిల్లలను కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో చదివించేందుకు తల్లిదండ్రులు తహతహలాడుతున్న రోజులివి. చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థలకే పంపుతున్న తరుణంలో.. ఒక జిల్లా అత్యున్నత అధికారే ఆదర్శంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తన కుమారుడు క్రిష్ ధరణ్‌రెడ్డిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని చేతల్లో నిరూపించారు.

     బదిలీ ఎక్కడికైనా.. చదువు సర్కారు బడిలోనే! 

    కలెక్టర్ ప్రభాకరరెడ్డికి ఇది కొత్తేమీ కాదు. గతంలో ఆయన ఎక్కడ పనిచేసినా తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు, ఆ తర్వాత విజయవాడలో శాప్   ఎండీగా పనిచేసిన కాలంలోనూ ఆయన ఇద్దరు పిల్లలను విజయవాడ పటమటలోని జెడ్పీ హైస్కూల్‌లోనే చదివించారు. అక్కడ క్రిష్ ధరణ్‌రెడ్డి తొమ్మిదో తరగతి పూర్తి చేయగా, ప్రస్తుతం ప్రభాకరరెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావడంతో.. కుమారుడిని పార్వతీపురంలోని ప్రతిష్టాత్మక ‘డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్’ లో పదో తరగతిలో చేర్పించారు. సాధారణ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిలాగే క్యూలైన్‌లో నిలబడి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేశారు.

    కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలు 

    ఈ ఏడాది  విడుదలైన ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల సత్తాను చాటాయి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి పోటీ ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 590 కి పైగా మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. మరీ ముఖ్యంగా, కలెక్టర్ ప్రభాకరరెడ్డి నేతృత్వంలోని పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతం ఉత్తీర్ణతతో వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలోనే నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందనడానికి ఈ రికార్డు స్థాయి ఫలితాలే నిదర్శనం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ల సదస్సులో ప్రభాకరరెడ్డి విద్యా విధానాలను, ఆయన ప్రవేశపెట్టిన  ముస్తాబు విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

     రెట్టింపైన ఉపాధ్యాయుల బాధ్యత 

    ఒక జిల్లా మేజిస్ట్రేట్ కుమారుడు తమ పాఠశాలలో చేరడంతో స్కూల్ సిబ్బంది, తోటి విద్యార్థుల తల్లిదండ్రులలో ఒక కొత్త ఉత్సాహం, నమ్మకం నెలకొన్నాయి. కలెక్టర్ కుమారుడు తమ స్కూల్‌లో చేరడం వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు, పర్యవేక్షణ లభిస్తాయని, బోధనలో తమ బాధ్యత కూడా మరింత పెరిగిందని ప్రధానోపాధ్యాయులు  ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఇదే పాఠశాలలో ఐటీడీఏ పీవోగా పనిచేసిన కూర్మనాథ్ కూడా తన కుమారుడిని చదివించారు.

    విద్యా వ్యవస్థలో సరికొత్త స్ఫూర్తి 

     

    అధికార గర్వం ప్రదర్శించకుండా, ప్రభుత్వ బడుల బలోపేతానికి స్వయంగా కలెక్టరే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సమాజానికి ఒక గొప్ప సందేశాన్నిచ్చింది. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినప్పుడే సామాన్యులకు కూడా ఆ వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల భారాన్ని మోయలేక సతమతమవుతున్న మధ్యతరగతి తల్లిదండ్రులకు కలెక్టర్ ప్రభాకరరెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

    Click here to Read More
    Previous Article
    US Iran Peace Deal: హర్మూజ్‌లో నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా, నౌకలకు లైన్ క్లియర్- అయినా ట్రంప్ ట్విస్ట్ !
    Next Article
    Save The Tigers 3 Review - 'సేవ్ ద టైగర్స్ 3' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో లేటెస్ట్ వెబ్ సిరీస్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment