Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Save The Tigers 3 Review - 'సేవ్ ద టైగర్స్ 3' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో లేటెస్ట్ వెబ్ సిరీస్

    5 hours ago

    OTT Review - Save The Tigers 3 On JioHotstar: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా రూపొందిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్ 3'. జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

    JioHotstar Latest Web Series Save The Tigers Season 3 Review In Telugu: జియో హాట్‌స్టార్ ఓటీటీలో 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ రెండు సీజన్లు వినోదంతో వీక్షకులను మెప్పించాయి. ప్రియదర్శి - జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం - పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ - దేవియాని శర్మకు తోడు మూడో సీజన్ 'సేవ్ ద టైగర్స్ 3'లో 'వెన్నెల' కిశోర్ కూడా ఉన్నారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? మొదటి రెండు సీజన్స్ తరహాలో నవ్విస్తుందా? లేదా? రివ్యూలో తెలుసుకోండి.

    కథ (Save The Tigers 3 Story): భార్య హైమావతి (జోర్దార్ సుజాత) కోరిక మేరకు గేటెడ్ కమ్యూనిటీకి కుటుంబంతో కలిసి షిఫ్ట్ అవుతాడు గంటా రవి (ప్రియదర్శి). కానీ, అక్కడ అతనికి సంతోషం ఉండదు. భార్య మాధురి (పావని గంగిరెడ్డి) ఆశించినట్టు ఉద్యోగంలో చేరతాడు రాహుల్ (అభివన్ గోమఠం). అయితే... బాస్ చెప్పినట్టు చేయలేక, ఆఫీసు వాతావరణంలో ఇమడలేక ఇబ్బంది పడతాడు. రేఖ (దేవియాని శర్మ)తో విక్రమ్ (చైతన్య కృష్ణ) విడాకుల కేసు కోర్టులో నలుగుతుంది. అతని బాధ అతనిది.

    తమ తమ తమ జీవితాల్లో సమస్యలకు కారణం ఇంద్రుడు (వెన్నెల కిశోర్) అని, 'మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్' అంటారు కనుక స్వర్గలోకపు అధిపతి ఇంద్రుణ్ణి తిట్టుకుంటారు రవి, రాహుల్, విక్రమ్. వాళ్ళ సంగతి చిత్రగుప్తుడు (గుండు సుదర్శన్) చేతిలో పెడతాడు ఇంద్రుడు. భూలోకానికి వచ్చిన గుప్తుడు ఏం చేశాడు? రవి, రాహుల్, విక్రమ్ జీవితాల్లో ఎటువంటి మార్పులు జరిగాయి? గుప్తుడు ఇచ్చిన ఆఫర్ వల్ల జీవితాలు ఎలా తల్లకిందులు అయ్యాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

    విశ్లేషణ (Save The Tigers Web Series Season 3 Review In Telugu): 'సేవ్ ద టైగర్స్' మొదటి రెండు సీజన్లలో భార్యాభర్తల మధ్య కథ నడిపిన క్రియేటర్లు మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం... ఈసారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేశారు. 'యమదొంగ' (ఎన్టీఆర్ సినిమాకు, ఈ సిరీస్‌కు కనెక్షన్ ఏమిటంటే?) తరహాలో హీరోలను ఓ లోకం నుంచి మరో లోకానికి పంపారు. ఒకరి స్థానంలో అచ్చంగా అటువంటి మనిషి మరొకరిని దింపారు. దాంతో కథకు ఫ్రెష్‌నెస్ యాడ్ అయ్యింది.

    'సేవ్ ద టైగర్స్ 2' స్పెషాలిటీ ఏమిటంటే... మెయిన్ లీడ్స్ ప్రియదర్శి - జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం - పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ - దేవియాని శర్మకు డ్యూయల్ రోల్ చేసే అవకాశం లభించింది. ఓ లోకంలో జంటలకు, మరొక లోకంలో జంటలకు గుణగణాలు వేర్వేరు. ప్రవర్తించే తీరు వేరు. ఓ లోకంలో పాత్రలు మరొక లోకంలోకి వెళ్లిన తర్వాత... సిరీస్ చూసే వీక్షకులకు ఎవరేమిటి? అనే క్లారిటీ ఉంటుంది. కానీ, తెరపై పాత్రలకు మాత్రం తెలియదు. అందువల్ల ఏం జరుగుతుందో అనే కుతూహలం ఉంటుంది. దాన్ని క్రియేటర్లు మహి వి రాఘవ్ & ప్రదీప్ అద్వైతం, దర్శకుడు శ్రీరామ్ ఎర‌గం బాగా వాడుకున్నారు.

    'సేవ్ ద టైగర్స్ 3' ప్రారంభమే ఇదొక సాధారణ భార్యాభర్తల కథ కాదని ఇంద్రుడి ఎంట్రీతో చెప్పేశారు. దాంతో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ట్విస్టులతో మొదటి రెండు ఎపిసోడ్స్ నడిపించారు. మధ్యలో సన్నివేశాలు కాస్త రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలిగినా... ఎండింగ్ రెండు ఎపిసోడ్స్ అదరగొట్టారు. ఈసారి ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేయడంతో ఫస్ట్ ఎపిసోడ్స్‌లో కామెడీని క్యూరియాసిటీ డామినేట్ చేసింది. అలాగే, భార్యాభర్తల నడుమ సన్నివేశాలు ఇంతకు ముందు చూసినట్టు ఉంటాయి. అయితే... వినోదాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు. కానీ, ఎండింగ్ వచ్చేసరికి కామెడీ డోస్ ఆడియన్స్ ఆశించిన స్థాయికి వస్తుంది.

    Click here to Read More
    Previous Article
    Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
    Next Article
    YSRCP Assembly Strategy: డీఎస్సీతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలోనే వార్ - వైఎస్ జగన్ డిసైడయ్యారా?

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment