Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    US Iran Peace Deal: హర్మూజ్‌లో నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా, నౌకలకు లైన్ క్లియర్- అయినా ట్రంప్ ట్విస్ట్ !

    5 hours ago

    అమెరికా, ఇరాన్‌ల మధ్య కీలక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అమెరికా బలహీనత వల్లే ఇది సాధ్యమైందని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అన్నారు.

    వాషింగ్టన్/ టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కీలక ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం అమెరికా ఆరాటపడిందని, అందుకు వారిలో పెరిగిన ఆందోళన, బలహీనతే కారణమని అన్నారు. ఈ ఒప్పందాన్ని సాకారం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు వీలైన తీరుగా ప్రభావం చేసేందుకు ప్రయత్నించారని మొజ్తబా ఖమేనీ పేర్కొన్నారు.

    నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన ట్రంప్
    ఇరాన్‌తో ఒప్పందం జరగడంతో హర్మూజ్ జలసంధిలో తాము విధించిన నేవీ దిగ్బంధనాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎత్తివేశారు. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దిగ్బంధనం ఎత్తివేసినా ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందంలోని అంశాలు అమలయ్యే వరకు అమెరికా వార్ షిప్స్ హర్మూజ్, పశ్చిమాసియాలో ఉంటాయని స్పష్టం చేసింది.
    అమెరికా - ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం ఖరారు
    ఇరాన్ అధినేత, అమెరికా అధ్యక్షుడి మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు మొజ్తబా ఖమేనీ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఇరాన్ అధికారులు పూర్తి నిబద్ధతతో చర్చలు ఈ ముగింపు దశకు చేరుకోవడానికి ప్రయత్నించారని, అయితే డీల్ కోసం అత్యధిక ప్రయత్నాలు చేసింది అమెరికా అని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నిరాశ, నిస్సహాయతతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వీలైన అన్ని మార్గాలను ఉపయోగించారని ఖమేనీ పేర్కొన్నారు. అమెరికా గనుక ఒప్పంద పరిమితులను దాటి మరిన్ని షరతులను మాపై రుద్దేందుకు ప్రయత్నిస్తే, ఇరాన్ వాటిని అంగీకరించబోదని చెప్పారు. ఇరాన్ ప్రజలు సంయమనం పాటించాలని, కండీషన్ల అమలు కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.

    ఒప్పందంపై నా అభిప్రాయం వేరు: ఖమేనీ
    అమెరికాతో జరిగిన శాంతి ఒప్పందంపై తన అభిప్రాయం వేరని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తెలిపారు. సైద్ధాంతికంగా తన ఆలోచన వేరని, కానీ ఇరాన్ అధ్యక్షుడు దేశం, రెసిస్టెన్స్ ఫ్రంట్ హక్కులను కాపాడాలనే ఒప్పందానికి అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు.  భవిష్యత్తులో అమెరికా హద్దులు దాటి డిమాండ్లు పెడితే ఇరాన్ మాత్రం సహించదన్నారు. 

    G7 సదస్సు ముగిసిన తర్వాత ఒప్పందం
    ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన డిన్నర్ సందర్భంగా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. జీ-7 సమ్మిట్ ముగిసిన అనంతరం ఫ్రాన్స్‌లోని వర్సయ్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందం శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని, హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరిచేందుకు దోహదం చేస్తుందని  మాక్రాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 

    జెనీవా సమావేశం 
    ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు స్విట్జర్లాండ్‌లో శుక్రవారం నాడు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగినా, జెనీవాలో సమావేశం జరుగుతుందని ఇరాన్ అధికారులు తెలిపారు. 

    ఈ ఒప్పందంలో పలు కీలక నిబంధనలు 

    -  ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) 30 రోజుల్లోగా తొలగించేందుకు అమెరికా అంగీకారం 
    -  లెబనాన్ లో సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయాలి
    -  సముద్రంలో నౌకల రాకపోకలను యుద్ధానికి ముందు నాటి స్థాయికి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలి 
    -  తుది సమగ్ర ఒప్పందం కుదిరిన 30 రోజుల్లోగా ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది.
    -  రాబోయే 60 రోజుల పాటు వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకలకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది.

    ఇక 60 రోజుల్లో తుది ఒప్పందం
    అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయినప్పటికీ అమెరికా, ఇరాన్ దేశాలు తుది ఒప్పందంపై 60 రోజుల తరువాత సంతకాలు చేయనున్నాయి. ఈ సమయంలో ఇరు దేశాలు ఒక సమగ్ర,  తుది ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుపుతాయి. ఈ చర్చలు సక్సెస్ అయితేనే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోయి ముడి చమురు రవాణాకు ఆటంకాలు ఉండవు.

    Click here to Read More
    Previous Article
    Fake Paneer: హైదరాబాద్‌లో ఫేక్ పనీర్‌ కలకలం.. తనిఖీల్లో 825 కేజీల చీజ్ అనలాగ్ స్వాధీనం- మీ ఆరోగ్యం జాగ్రత్త
    Next Article
    Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment